Fact Check : ప్రతి రోజూ శ్రీరాముడి పేరును ఫేస్ బుక్ లో రెండు బిలియన్ల సార్లు రాస్తున్నారని మార్క్ జూకర్ బర్గ్ తెలిపారా..?

Mark Zuckerberg Never Said Shri Ram is Written on Facebook 2 Billion Times. ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్, శ్రీ రాముడి ఫోటో సామాజిక

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2021 7:43 AM GMT
Fact Check : ప్రతి రోజూ శ్రీరాముడి పేరును ఫేస్ బుక్ లో రెండు బిలియన్ల సార్లు రాస్తున్నారని మార్క్ జూకర్ బర్గ్ తెలిపారా..?

ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్, శ్రీ రాముడి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ప్రతి రోజూ ఫేస్ బుక్ లో శ్రీరాముడి పేరును రెండు బిలియన్ల సార్లు రాస్తూ ఉన్నారని మార్క్ జూకర్ బర్గ్ చెప్పాడని ఆ ఫోటో సారాంశం.



నిజమెంత:

వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు.

శ్రీరాముడి గురించి మార్క్ జూకర్ బర్గ్ చేసిన ఎటువంటి వ్యాఖ్యలు కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రచురించలేదు. అధికారిక వ్యాఖ్యలకు సంబంధించిన ఏ సమాచారం కూడా గూగుల్ సెర్చ్, బింగ్ సెర్చ్ లో కూడా కనిపించలేదు. సెర్చ్ ఇంజన్స్ లో ఈ వ్యాఖ్యలపై ఎటువంటి సమాచారం లేదు.



ఫేస్‌బుక్‌లో శ్రీరాముడి గురించి రాయడం పై మార్క్ జూకర్‌బర్గ్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు.

మా పరిశోధనను మరింత మెరుగుపరచడానికి మేము ఫేస్‌బుక్ న్యూస్‌రూమ్ పేజీని కూడా చూశాము. ఇక్కడే అన్ని అప్డేట్స్ పోస్ట్ చేయబడతాయి. ఇక్కడ కూడా శ్రీరాముడి పేరు గురించి ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.

ఫేస్ బుక్ ట్రెండ్స్ గురించి కూడా చూసాము. అందులో కూడా ఎక్కడా శ్రీరాముడి పేరు మీద అయిన ట్రెండ్స్ ను ప్రస్తావించలేదు. ఎటువంటి రిపోర్టులు కూడా లభించలేదు.

https://www.facebook.com/business/search/?q=shri%20ram

2020 సంవత్సరంలో కూడా ఇలాంటి మెసేజీలు, పోస్టులు వైరల్ అయ్యాయి. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ కథనాలను కొట్టేశాయి. అలాంటివే మరోసారి 2021లో కూడా వైరల్ అవుతున్నాయి.

https://www.indiatoday.in/fact-check/story/zuckerberg-never-said-this-about-the-jai-shri-ram-slogan-1715937-2020-08-28

ప్రతి రోజూ శ్రీరాముడి పేరును ఫేస్ బుక్ లో రెండు బిలియన్ల సార్లు రాస్తున్నారని మార్క్ జూకర్ బర్గ్ చెప్పారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:ప్రతి రోజూ శ్రీరాముడి పేరును ఫేస్ బుక్ లో రెండు బిలియన్ల సార్లు రాస్తున్నారని మార్క్ జూకర్ బర్గ్ తెలిపారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Fact Check:False
Next Story