మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ చనిపోయారంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు.
మణిపూర్‌లో ఇటీవలి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కొందరు ముఖ్యమంత్రి తీరు పట్ల సంతోషంగా లేరు. ఆగ్రహించిన చాలా మంది తమ ముఖ్యమంత్రి చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టుల్లో చెబుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
మణిపూర్ ముఖ్యమంత్రి క్షేమంగా, సజీవంగా ఉన్నారని.. వైరల్ అవుతున్న పోస్టులు నకిలీవని న్యూస్ మీటర్ గుర్తించింది.
వైరల్ పోస్ట్ 4 మే 2023న అప్‌లోడ్ చేశారని మేము గమనించాము బీరెన్ సింగ్ మరణం గురించి ఎటువంటి నివేదికలు, వార్తా కథనాలను కూడా మేము కనుగొనలేదు.
ఆయన మరణం ఖచ్చితంగా మీడియా దృష్టిని ఆకర్షించేదని గుర్తించాలి.
మే 6 న "మణిపూర్ లో హింస విషయమై సిఎం బీరేన్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు" అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా నివేదికను మేము కనుగొన్నాము. మణిపూర్ సిఎం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీ, సీపీఐ, ఆప్, శివసేన వంటి పార్టీలను ఈ సమావేశానికి పిలిచారు.
The Hindu, Hindustan Times కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ క్షేమంగా, సజీవంగా ఉన్నారని స్పష్టమైంది. మణిపూర్‌లో ఇటీవలి హింస, అల్లర్ల కారణంగా ఇలాంటి పుకార్లు వచ్చాయి. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik