Fact Check : ట్రంప్ కు మద్దతుగా భారత జాతీయ పతాకాన్ని మోసుకెళ్లిన వ్యక్తి కేరళ ప్రాంతానికి చెందినవాడేనా..?

Man who waved tricolor at Capitol is from Kochi. ఇటీవల వాషింగ్టన్ లో ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన విధ్వంసాన్ని

By Medi Samrat  Published on  12 Jan 2021 11:06 AM GMT
trump supporter

ఇటీవల వాషింగ్టన్ లో ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసింది. క్యాపిటల్ బిల్డింగ్ వద్ద చోటు చేసుకున్న గొడవల్లో భారత జాతీయ పతాకం కనిపించడం కూడా సంచలనం అయింది. జాతీయ పతాకాన్ని పట్టుకుని ఓ వ్యక్తి తిరుగుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

"Some blind #bhakts have joined the attack on democracy in the US with our Indian Flag, which represents the hopes and aspirations of millions of people in India. Why can't these morons use BJP Flag instead or use RSS one? The man behind `Ab Ki Baar Trump Sarkaar' should answer!!!" అంటూ ట్వీట్లు చేశారు. ఒక్క వ్యక్తి అలా భారతీయ జెండా పట్టుకుని వెళ్లడం వలన భారతీయులు అందరి మీద కూడా చెడు అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉందని.. జాతీయ పతాకంకు బదులుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పతాకాన్ని అతడు తీసుకుని వెళ్లి ఉండి ఉంటే బాగున్ను అని విమర్శలు వచ్చాయి.




జాతీయ పతాకాన్ని తీసుకుని వెళ్లిన వాళ్లు పక్కాగా మోదీ భక్తులే అయ్యి ఉంటారని పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

క్యాపిటల్ బిల్డింగ్ వద్ద చోటు చేసుకున్న అల్లర్లలో భారత జాతీయ పతాకాన్ని మోసిన వ్యక్తి మోదీ భక్తుడే అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

'Indian Flag at the capitol siege' కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. అందుకు సంబంధించిన పోస్టులు ఎన్నో కనిపించాయి. అంతేకాకుండా మీడియాలో కూడా అతడికి సంబంధించిన సమాచారం వచ్చింది.

Times of India రిపోర్టుల ప్రకారం.. క్యాపిటల్ బిల్డింగ్ వద్ద భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన వ్యక్తి కేరళకు చెందిన వారు. విన్సెంట్ జేవియర్ పాలతింగళ్ అనే వ్యక్తి కొచ్చి నుండి అమెరికాకు వెళ్ళాడు. తాను చేసిన పని ఏ మాత్రం తప్పు కాదని మీడియాకు చెప్పాడు. భారతీయ అమెరికన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని తాను తెలియజేయాలని అనుకున్నానని అందుకే భారత జాతీయ పతాకాన్ని తీసుకుని వెళ్లానని అన్నాడు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని తాము కూడా అనుకోలేదని.. అటు వంటి ఉద్దేశ్యం డొనాల్డ్ ట్రంప్ కు కూడా లేదని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు.


విన్సెంట్ జేవియర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ట్రంప్ కు మద్దతుగా చోటు చేసుకున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను గతంలో పోస్టు చేశాడు. పలు దేశాలకు సంబంధించిన వాళ్లు కూడా ట్రంప్ కు మద్దతుగా ఉన్నారని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

CNN News 18 మీడియా సంస్థతో మాట్లాడుతూ నిరసన కార్యక్రమం చేపట్టినందుకు తాను బాధపడడం లేదని.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల బాధను వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. తాను రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారుడినని విన్సెంట్ చెప్పుకొచ్చారు.



క్యాపిటల్ బిల్డింగ్ వద్ద చోటు చేసుకున్న నిరసనల్లో భారత జాతీయ పతాకం కనిపించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. అయితే విన్సెంట్ జేవియర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడని పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. 2015లో శశిథరూర్ తో కలిసి ఓ కార్యక్రమంలో విన్ సెంట్ జేవియర్ పాల్గొన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నట్లుగా విన్ సెంట్ జేవియర్ మోదీ భక్త్ కాదు.. సంఘ్ పరివార్ కు చెందిన వ్యక్తి కూడా కాదు. ట్రంప్ కు మద్దతు తెలుపుతున్న ఓ వ్యక్తి మాత్రమే. అమెరికా లోని వర్జీనియాలో కేరళ నుండి వెళ్లి స్థిరపడ్డాడు.


Claim Review:ట్రంప్ కు మద్దతుగా భారత జాతీయ పతాకాన్ని మోసుకెళ్లిన వ్యక్తి కేరళ ప్రాంతానికి చెందినవాడేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story