FactCheck : ఎన్.సి.బి. అధికారి ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ తీసుకున్నారా..?

Man Taking Selfie with Aryan Khan is not NCB Official. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2021 9:02 PM IST
FactCheck : ఎన్.సి.బి. అధికారి ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ తీసుకున్నారా..?

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీకి అప్పగించింది.అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీలో ఆర్యన్ ఖాన్ ఉండనున్నాడు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్యన్ ఖాన్ తో పాటు, ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాను కూడా అక్టోబర్ 7 వరకు ఎన్‌సిబి కస్టడీకి పంపించారు.

ఆర్యన్ ఖాన్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన కేసులను బట్టి అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన మరో ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సి), 20 (బి), 27 రెడ్ విత్ సెక్షన్ 35 ఉన్నాయి. వీరి అరెస్ట్ సమయంలో 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 ట్యాబ్లెట్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

ఆర్యన్ ఖాన్ తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మీడియా ఛానల్స్ లో కూడా టెలీకాస్ట్ అయ్యింది. అయితే ఆ వ్యక్తి ఎన్‌సిబి అధికారి అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ ఫోటోపై న్యూస్‌మీటర్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. ఇది మమ్మల్ని ANI ద్వారా చేసిన ట్వీట్ కు దారితీసింది. "ఆర్యన్ ఖాన్‌తో ఉన్న ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి NCB యొక్క అధికారి లేదా ఉద్యోగి కాదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్పష్టం చేసింది." అని ఉంది.

ఏఎన్ఐ అందుకు సంబంధించి ఒక నివేదికను ప్రచురించింది. " ఆర్యన్ ఖాన్‌తో వైరల్ సెల్ఫీలో ఉన్న మనిషి ఎన్ సి బి అధికారి కాదని స్పష్టం చేసింది".

NDTV, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, పింక్‌విల్లా, జీ న్యూస్ మరియు OpIndia తో సహా అనేక ప్రధాన మీడియా సంస్థలు, వైరల్ చిత్రంలో ఉన్న వ్యక్తి NCB అధికారి కాదని నివేదించాయి. నివేదికల ప్రకారం ఎన్‌సిబి పుకార్లకు స్వస్తి చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

"షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టైన తర్వాత, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయం లోపల నుండి స్టార్ కిడ్ యొక్క అనేక చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలలో ఒకదానిలో బట్టతల మనిషి ఆర్యన్‌తో సెల్ఫీ దిగడం మరియు అతడిని ఎన్‌సిబి అధికారిగా భావించారు. అయితే, నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి విచారణ అధికారి లేదా ఉద్యోగి కాదని ఎన్‌సిబి స్పష్టం చేసింది. " అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.


కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:ఎన్.సి.బి. అధికారి ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ తీసుకున్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story