'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినియోగదారులు ఆ వ్యక్తిని అసోం ముఖ్యమంత్రి అని చెబుతూ వస్తున్నారు.
"అస్సాం ముఖ్యమంత్రి ప్రసంగం ఇది. ఇందులో అతను తన మనసులో మాటను చెప్పాడు! అర్థం చేసుకోండి. ఇది కొత్త భారతదేశం " అని పోస్ట్ ఉంది. చాలా తక్కువ నిడివి ఉన్న పోస్టును పలువురు షేర్ చేస్తూ వస్తున్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్ లో కూడా ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్‌మీటర్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది, ఇది మాకు రాంప్రసాద్ జెట్టి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోకి దారితీసింది. వీడియోలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్ నాయకుడు రామేశ్వర్ శర్మ అని తెలిపారు.
https://bit.ly/3AqniFc
ఈ ఆధారాలతో న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. ఈ సంవత్సరం ఆగస్టు 21 న ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు.
మేము మరొక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. 2021 ఆగస్టు 22 న జనసత్తా ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము. నివేదిక ప్రకారం, భోపాల్‌లో ఉన్న హుజూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ యొక్క వీడియో వైరల్ అయింది.. మీడియాతో మాట్లాడిన రామేశ్వర్ శర్మ ఇది భారతదేశం అని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరైనా భారత గడ్డపై `పాకిస్థాన్ జిందాబాద్ 'నినాదాన్ని లేవనెత్తితే బాగోదని వార్నింగ్ ఇచ్చారు.
మేము చివరిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మల చిత్రాన్ని పోల్చాము. వీడియోలో ఉన్న వ్యక్తి.. అస్సాం ముఖ్యమంత్రి కానే కాదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.