అరేబియా సంప్రదాయ దుస్తులలో కొందరు వ్యక్తులు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దుబాయ్ ప్రిన్స్, దుబాయ్ పోలీసులతో కలిసి ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వీడియోలో ఉందని వినియోగదారులు పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను “దుబాయ్ యువరాజు, దుబాయ్ పోలీసులు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జై హింద్ జై భారత్.”(“Dubai Prince and Dubai Police celebrating India’s Independence Day. Jai Hind Jai Bharat. (sic)”) అని ఉంది.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌ను చూపించలేదని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ వైరల్ వీడియో ఉన్నది దుబాయ్‌లో ఉన్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ఇక్బాల్ హాట్‌బూర్.
వైరల్ వీడియో ‘@Iqbaal_hatboor’ అనే వినియోగదారు పేరును కలిగి ఉంది. దీన్ని ఒక క్యూగా తీసుకొని, మేము Instagram, Facebookలో సెర్చ్ చేసాము. రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ఇక్బాల్ పోస్ట్ చేసిన అదే వీడియోను కనుగొన్నాము.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నట్లు క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు యూఏఈ ప్రభుత్వానికి, దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో, హాట్‌బూర్ తనను తాను ‘Entrepreneur, Businessman, Influencer, Traveller, social worker’'గా గుర్తించాడు. తాను యూఏఈలో ఉన్నానని.. బిజినెస్ మ్యాన్, ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెలర్, సోషల్ వర్కర్ గా చెప్పుకొచ్చాడు.
2019లో ఫేస్‌బుక్‌లో హాట్‌బూర్ పోస్ట్ చేసిన ఫోటో కూడా మాకు కనిపించింది. అది దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌ని కలుసుకున్నాడు.
మలయాళ వార్తా సంస్థ మాతృభూమి బుర్జ్ ఖలీఫా దగ్గర హాట్‌బూర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు నివేదించింది.
ఇక్బాల్ హాట్బూర్ కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన వ్యక్తి 2020లో 'సమయం మలయాళం' మీడియా సంస్థ నివేదించింది.
దుబాయ్ యువరాజు భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam