'టిప్ టిప్ బర్సా పానీ' అనే బాలీవుడ్ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు అమీర్ లియాఖత్ హుస్సేన్ అని వినియోగదారులు పేర్కొన్నారు. ఒక వీడియో 438k పైగా వ్యూస్ లను పొందింది. ఒక ట్విటర్ వినియోగదారుడు
"వావ్ @AamirLiaquat అది అద్భుతమైన డ్యాన్స్, మీరు ఇందులో చాలా నైపుణ్యం కలిగి ఉన్నారని నమ్మలేకపోతున్నాను" అని చెప్పగా.. ఇంకొంత మంది కూడా అతడిని "అమీర్ లియాఖత్"గా ప్రచారం చేశారు.
ANI, అమర్ ఉజాలా మరియు జాగ్రన్ వంటి పలు వార్తా సంస్థలు ఇదే విషయాన్ని పేర్కొంటూ వార్తాకథనాలను ప్రచురించాయి. ANI ఈ చిత్రానికి "Pakistan national assembly member dances to Indian hit song 'Tip tip barsa paani'." క్యాప్షన్ కూడా ఇచ్చింది.
https://archive.st/archive/2022/1/www.aninews.in/aowr/www.aninews.in/news/world/asia/pakistan-national-assembly-member-dances-to-indian-hit-song-tip-tip-barsa-paani20220106115244/index.html
https://web.archive.org/web/20220108025616/https://www.amarujala.com/world/pakistani-mp-dance-video-trends-pakistani-mp-aamir-liaquat-hussain-funny-dance
https://web.archive.org/web/20220108025332/https://www.jagran.com/entertainment/bollywood-pakistani-mp-aamir-liaquat-hussain-has-troll-for-dance-on-song-tip-tip-barsa-pani-film-of-sooryavanshi-22357783.html
నిజ నిర్ధారణ :
వీడియోలో ఉన్న వ్యక్తి అమీర్ లియాఖత్ హుస్సేన్ కాదని, కొరియోగ్రాఫర్ షోయబ్ షకూర్ అని పలువురు తెలిపారు.
Twitter వినియోగదారులు అందించిన సూచనల ఆధారంగా.. NewsMeter అదే వీడియోను లాహోర్‌లోని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో అయిన 'HS స్టూడియో బై బిలాల్ సయీద్' అనే Facebook పేజీలో అప్‌లోడ్ చేసినట్లు కనుగొంది. ఈ పేజీ లో ఆ వ్యక్తిని "@shoaibshakoor"గా తెలియజేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షకూర్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసిన తర్వాత, అతనిని 'కొరియోగ్రాఫర్, పెర్ఫార్మర్' అని తెలియజేసిన తర్వాత, అదే వీడియోను జనవరి 4న పోస్ట్ చేయడాన్ని గమనించాము.
ఒక కొరియోగ్రాఫర్ బాలీవుడ్ పాటకి డ్యాన్స్ చేస్తున్న వీడియో పాకిస్తాన్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ అని తప్పుగా షేర్ చేయబడుతోంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.