ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతను కొందరు మహిళలు చితక్కొట్టారనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అమ్రోహా బీజేపీ ఎమ్మెల్యేను మహిళలు ఇష్టమొచ్చినట్లు కొట్టారని.. అలా కొట్టినప్పుడు ఆయన బట్టలు కూడా చినిగిపోయాయని వెల్లడించారు.
"ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమ్రోహా బీజేపీ ఎమ్మెల్యేను మహిళలు ఇష్టమొచ్చినట్లు కట్టెలు, చెప్పులతో కొట్టారు" అంటూ పలువురు పోస్టులను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.
నిజ నిర్ధారణ:
కొందరు మహిళలు బీజేపీ ఎమ్మెల్యేను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
యుపి శాసనసభ అధికారిక వెబ్‌సైట్ నుండి, అమ్రోహా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కు చెందిన మెహబూబ్ అలీ అని తెలుస్తోంది. హసన్‌పూర్, ధనౌరా, నౌగాన్ సదాత్ మిగతా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు మహేంద్ర సింగ్ ఖర్గ్వాన్షి, రాజీవ్ తారా, సంగీత చౌహాన్. వీళ్లకు వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు.
http://uplegisassembly.gov.in/Members/main_members_en.aspx#/ElectedMembers/17
The Lallantop.com, The Voice Hindi News, News18 India మీడియా సంస్థలు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాయి.
ఈ వీడియోలు ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందినవి. వీటిలో కనిపించిన వ్యక్తి పేరు మదన్ వర్మ. మదన్ వర్మతో మాట్లాడగా.. తాను బీజేపీ ఎమ్మెల్యే కాదని, పార్టీకి సంబంధించిన ఏ పదవిలోనూ లేనని చెప్పారు. ఇంతకు ముందు బీజేపీ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లేబర్ సెల్ కన్వీనర్ గా ఉండేవాన్నని తెలిపారు. ప్రస్తుతం పలోలా సహకార సంఘం చైర్మన్ గా ఉన్నారని The Lallantop.com నివేదికలో ఉంది.
మదన్ వర్మ మంత్రుల ముందు రేషన్ డీలర్లకు అనుకూలంగా ఉన్నారని మహిళలు ఆరోపించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. కార్డు జారీ చేయడానికి డబ్బు కోరినట్లు కూడా అతనిపై ఆరోపణలు వచ్చాయి. మదన్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.. ఆ సమయంలో మహిళలు అతనిని చుట్టుముట్టి కొట్టారు. అప్పుడు అతని కుర్తా చిరిగిపోయింది.
ఈ ఘటనపై మదన్ వర్మ మాట్లాడుతూ "రేషన్ కార్డుల కోసం మహిళలు సమావేశానికి వచ్చారు. రేషన్ కార్డులు ఇక్కడ ఇవ్వరని ఆమెకు చెప్పినప్పుడు, ఆమె గొడవ పడడం మొదలైంది. వారిని శాంతింపచేయడానికి, నేను లోపలికి వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ ఎవరో నా కుర్తా చింపేశారు. కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ మొత్తం వ్యవహారం ప్రతిపక్షాల కుట్ర " అని ఆరోపించారు.
కొందరు మహిళలు బీజేపీ ఎమ్మెల్యేను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వార్తలు అబద్ధం. అక్కడ ఉన్న వ్యక్తి అసలు ఎమ్మెల్యేనే కాదు.