FactCheck : పుతిన్ స్వయంగా ఎయిర్ ఇండియా విమానంలోకి వెళ్ళారా..?

Man Addressing Students is not Putin but Indian Ambassador to Romania. ఉక్రెయిన్ నుండి భారత్ కు తరలించబడుతున్న విద్యార్థులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విమానంలో మాట్లాడుతున్నట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 March 2022 9:00 PM IST
FactCheck : పుతిన్ స్వయంగా ఎయిర్ ఇండియా విమానంలోకి వెళ్ళారా..?

ఉక్రెయిన్ నుండి భారత్ కు తరలించబడుతున్న విద్యార్థులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విమానంలో మాట్లాడుతున్నట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతోంది. భారతీయులను ఒప్పించేందుకే పుతిన్ ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారని నెటిజన్లు చెబుతున్నారు.

ఉక్రెయిన్ లోని భారత విద్యార్థులను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి భారత అధికారులు భారీ తరలింపు ఆపరేషన్‌ను ప్రారంభించారు.


"భారతీయులను కన్విన్స్ చేయడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా (AI) AIR INDIA విమానంలో నేరుగా వెళ్లారు. భారతదేశానికి ఎంత గౌరవం. భారతీయుడిగా ఉన్నందుకు గర్వపడండి. ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్," అని వీడియోలో ఉంది.


నిజ నిర్ధారణ :

వైరల్ వీడియోలో ET NOW అనే లోగో ఉంది. అదే వీడియోను ఫిబ్రవరి 26న ET NOW యొక్క ట్విట్టర్ ఖాతా ద్వారా అప్లోడ్ చేయబడింది. వీడియోలోని వ్యక్తి రొమేనియాలో భారత రాయబారి రాహుల్ శ్రీవాస్తవ అని క్యాప్షన్ లో వివరించారు.

ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, ANI నివేదికల ప్రకారం, బుకారెస్ట్ నుండి ముంబైకి మొదటి తరలింపు విమానంలో శ్రీవాస్తవ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటికి వెళ్లేందుకు ఇదే చివరి ఘట్టమని విద్యార్థులకు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికీ చిక్కుకుపోయిన వ్యక్తులను ఆయన వారికి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరినీ ఉక్రెయిన్ నుండి ఖాళీ చేయడానికి భారతదేశ ప్రభుత్వం పగలు, రాత్రి కృషి చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ నుండి చివరి భారతీయుడిని బయటకు తీసుకువెళ్లే వరకు మా లక్ష్యం పూర్తి కాదని ఆయన అన్నారు.

రొమేనియాలోని భారత రాయబారి రాహుల్ శ్రీవాస్తవగా చెబుతూ అదే వీడియోను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా షేర్ చేసింది.


వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాదు, రొమేనియాలోని భారత రాయబారి రాహుల్ శ్రీవాస్తవ. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Next Story