ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ జకీర్ నాయక్‌ను మలేషియా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిందని, ముంబైకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్కైవ్ చేసిన లింక్: https://archive.is/4EVOs
అలాంటి పోస్టులను చూడాలని ఉంటే క్లిక్ చేయండి.
"ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ జకీర్ నాయక్ ను మలేషియా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించింది. అర్ధరాత్రి సమయంలో ముంబైకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయం సాధించాం" అని ట్విట్టర్ యూజర్ చేసిన పోస్టుల్లో ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
జకీర్ నాయక్ కు సంబంధించిన వార్తల కోసం గూగుల్ లో సెర్చ్ చేయగా.. అతడిని భారత్ కు అప్పగిస్తున్నట్లుగా ఎటువంటి వార్తలు లేవు. జులై 6, 2018న ఆయనకు సంబంధించిన ఓ వార్త వచ్చింది.. ఆ వార్తా కథనంలో జకీర్ నాయక్ ను భారత్ కు అప్పగించడం కుదరదని మలేషియా ప్రభుత్వం తెలిపింది.
ఇండియా టుడేలో 14 ఆగష్టు 2019న మరో కథనం వచ్చింది. అందులో జకీర్ నాయక్ ను భారత్ కు అప్పగించలేమని మలేషియా ప్రధాన మంత్రి చెప్పారని ఉంది.
ఇలాంటి కథనాలు పలు మీడియా సంస్థల్లో వచ్చాయి.
డాక్టర్ జకీర్ నాయక్‌ను భారత్‌కు తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అతన్ని భారతదేశానికి తరలించాలని మలేషియా ప్రభుత్వాన్ని భారత్ నిరంతరం అభ్యర్థిస్తోంది. జకీర్ నాయక్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం మలేషియాకు అధికారిక అభ్యర్థన పంపినట్లు 14 మే 2020 నుండి ANI చేసిన ట్వీట్ లో ఉంది.
కాబట్టి భారత్ కు మలేషియా ప్రభుత్వం జకీర్ నాయక్ ను అప్పగించిందనే కథనాల్లో 'ఎటువంటి నిజం లేదు'.