FactCheck : భారతీయ జనతా పార్టీ నేతల వాహనాలపై ప్రజలు దాడి చేశారా..?
Locals did not Thrash BJP Leaders Viral Claims are False. రోడ్డు మీద ఉన్న ప్రజలు పలు వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2021 2:48 PM IST
రోడ్డు మీద ఉన్న ప్రజలు పలు వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో స్థానికులు బీజేపీ నేతలపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. 'ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు' అని పోస్ట్‌పై సెటైరికల్ క్యాప్షన్ ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని.. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. డిసెంబర్ 08, 2021న `అగ్నిబాన్'పై ప్రచురించిన నివేదికకు దారితీసింది. ఆ నివేదిక వైరల్ వీడియోకు సంబంధించిన విజువల్స్‌తో కూడిన స్క్రీన్‌షాట్‌ను ప్రచురించింది.
"ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో, భదావర్ మహారాజ్ అని పిలువబడే మాజీ మంత్రి అరిదామన్ సింగ్, మాజీ బ్లాక్ చీఫ్ సుగ్రీవ్ సింగ్ చౌహాన్ మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వందలాది మంది మద్దతుదారులు బాహా బాహీకి దిగారు. తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ జెండా ఉన్న అర డజనుకు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి" అని నివేదిక పేర్కొంది.
దీన్ని బట్టి టీమ్ కీవర్డ్ సెర్చ్ చేసింది.. ఇది డిసెంబర్ 07, 2021న ఆజ్ తక్ ప్రచురించిన ఒక నివేదికకు దారితీసింది. ఈ నివేదిక శీర్షిక "యుపి: ఆగ్రాలో టిక్కెట్ కోసం పోరు, ఇద్దరు బీజేపీ నాయకుల మద్దతుదారులు తీవ్రంగా రాళ్లు రువ్వారు. వాహనాల అద్దాలు పగలగొట్టారు". ఈ నివేదికలో ఇలాంటి విజువల్స్ ఉన్నాయి.
నివేదిక ప్రకారం మొత్తం వ్యవహారం బాహ్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ టిక్కెట్టు పొందడానికి సంబంధించినది.
"టికెట్ విషయంలో మాజీ మంత్రి, మాజీ బ్లాక్ చీఫ్‌కు మధ్య ఆధిపత్య పోరు ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థులకు తన బలాన్ని చూపించడానికి, మాజీ మంత్రి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాణి పక్షాలికా సింగ్ భర్త రాజా అరిదమన్ సింగ్ పినాహట్ పట్టణం నుండి ప్రజా చైతన్య ర్యాలీ చేపట్టారు. నందగావా కూడలి వద్ద అరిదమన్ సింగ్, సుగ్రీవ్ మద్దతుదారులు గొడవకు దిగారు. దాని ఫలితంగా రాళ్ల దాడి జరిగింది. మార్కెట్‌లో తొక్కిసలాట జరిగింది. దుకాణదారులు దుకాణాలను మూసివేశారని పలు మీడియా సంస్థలు తెలిపారు.
"సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, అనేక పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్రా ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, విచారణ తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు" అని ABP నివేదించింది.
ఈ సంఘటనను TV9 Bharatvarsh, Navbharat Times, India TV, Quint Hindiతో సహా ఇతర ప్రధాన స్రవంతి మీడియా కూడా వారి సంబంధిత YouTube ఛానెల్‌లు మరియు వెబ్‌సైట్‌లో నివేదించాయి.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.