గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌ను హత్య చేసిన వ్యక్తులు మతపరమైన నినాదాలు చేయలేదని పలువురు ట్విట్టర్ వినియోగదారులు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ 15న మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. అది కూడా లైవ్ లో అందరూ చూస్తూ ఉండగానే..!
పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కాల్పుల సమయంలో ఎటువంటి మతపరమైన నినాదాలు లేవనెత్తలేదని అంటున్నారు.
ముగ్గురు షూటర్లు బాండాకు చెందిన లువ్లేష్ తివారీ (22), మోహిత్ అలియాస్ సన్నీ (23), అరుణ్ కుమార్ మౌర్య (18) అక్కడికక్కడే పట్టుబడ్డారు. కోర్టు వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
నిజ నిర్ధారణ :
అతిక్ అహ్మద్ హత్య టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. హిందుస్థాన్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో హత్య ఫుటేజీని మేము కనుగొన్నాము. వీడియోలోని మొదటి 10 సెకన్లలో హత్యకు పాల్పడ్డ వాళ్లు "జై శ్రీ రామ్" అని నినాదాలు చేయడం వినవచ్చు. అతిక్ అహ్మద్ హత్యకు గురైనప్పుడు మతపరమైన నినాదాలు చేశారని దీన్ని బట్టి తెలుస్తోంది.
జీ న్యూస్, హిందూస్తాన్ టైమ్స్, ది టెలిగ్రాఫ్ ఇండియా, టైమ్స్ నౌ వంటి మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
Credits : Sunanda Naik