బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆమెకు సంబంధించి గతంలో అనేక వివాదాస్పద పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. కరీనా కపూర్ ఖాన్ చేసిన ద్వేషపూరిత ట్వీట్ అంటూ ఓ స్క్రీన్ షాట్‌ను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా హిందీలో పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ఆ ట్వీట్ నకిలీ X ఖాతా నుండి వచ్చిందని NewsMeter కనుగొంది.
కరీనా కపూర్ ఖాన్‌కి Xలో ఖాతా ఉందో లేదో తెలుసుకోవడానికి మేము సెర్చ్ చేశాం. ఆమె అధికారిక అకౌంట్ ఏదీ మేము కనుక్కోలేకపోయాము.
ఆగస్ట్ 10, 2022న ప్రచురించబడిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ని మేము కనుగొన్నాము. ప్రతిరోజూ సెలబ్రిటీలు ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారని.. ఆ కారణంగా తాను Twitter (ఇప్పుడు X)ని ఇష్టపడనని ఆమె చెప్పారు.
“అందుకే తాను ట్విట్టర్‌లో లేను. కొందరు కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు.. ద్వేషంతో కామెంట్లు చేస్తూ ఉంటారు. అందుకు నేను సమయం కేటాయించాలని అనుకోవడం లేదు” అనే అర్థం వచ్చేలా కరీనా కపూర్ ఖాన్ చెప్పినట్లుగా అందులో నివేదించారు.
అందువల్ల, కరీనాకు Xలో ఖాతా లేదని, ట్వీట్ నకిలీ ఖాతా నుండి వచ్చిందని స్పష్టమైంది.
మైక్రోబ్లాగింగ్ సైట్ X లో పలువురు నటీనటుల పెయిడ్ అకౌంట్లు ఉన్నాయి. ఇంకొన్ని ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి.
నకిలీ ట్వీట్‌ని పోస్ట్ చేసిన X హ్యాండిల్ @Karina_Kapoor__. అధికారిక అకౌంట్ కాదని మేము కనుగొన్నాం. కరీనా పేరు మీద చేసిన పేరడీ ఖాతా అని మేము కనుగొన్నాము. ఖాతాలోని వైరల్ ట్వీట్ జూలై 31, 2023న అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము.
వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. కరీనా కపూర్ అధికారిక అకౌంట్ నుండి వచ్చినది కాదు. అదొక ఫేక్ అకౌంట్.
Credits : Sunanda Naik