ఎన్డీటీవీ మీడియా సంస్థను భారత సంపన్నుడు అదానీ కొనేశారనే వార్తలు వచ్చాయి. ఎన్డీటీవీలో వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ తాజాగా ప్రతిపాదన చేసింది. 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటి రూ.294 ముఖ విలువతో మొత్తం రూ.492 కోట్లకు కొనుగోలు చేసేందుకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తమ సంస్థలో వాటాలు టేకోవర్ చేసుకోవడానికి అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు సెబీ ఆమోదం అవసరం అని కూడా ఎన్డీటీవీ గ్రూప్ తెలిపింది. రెండేండ్ల పాటు తమ సంస్థ ప్రమోటర్ల షేర్ల క్రయ, విక్రయాలపై 2020 నవంబర్‌లో నిషేధం విధించిందని గుర్తు చేసింది. ఈ తరుణంలో తమ నెట్‌వర్క్ గ్రూప్‌ను టేకోవర్ చేయడానికి అదానీ గ్రూప్‌కు సెబీ ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ గడువు వచ్చే నవంబర్ 26తో ముగుస్తుందని వివరించింది.
అయితే.. NDTV సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ రాజీనామా చేశారంటూ.. సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేయడం ప్రారంభమయ్యాయి.
"Ravish Kumar resigned from NDTV. The man has proved if the conscience is alive, even if the buyer is the king of the country, he will return empty handed. Salute to you Ravish Kumar ji (sic)." అంటూ రవీష్ కుమార్ ఉన్న ఫోటో ఉన్న వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. NDTV జర్నలిస్ట్ రవీష్ కుమార్ రాజీనామా గురించి ఎటువంటి నివేదికలు కనుగొనబడలేదు. రవీష్ కుమార్ తాను NDTV నుండి నిష్క్రమించలేదని, ఆ పుకార్లు అవాస్తవమని ధృవీకరిస్తున్నట్లు మేము కనుగొన్నాము.
ఆగస్ట్ 24న, సీనియర్ జర్నలిస్ట్ తాను NDTVని విడిచిపెట్టలేదని ట్వీట్ చేశారు. హిందీ ట్వీట్ ఇలా ఉంది.. "నా రాజీనామా అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారని.. అక్షయ్ కుమార్ నా కోసం వేచి ఉన్నారనే పుకారుల్లా ఉంది." అని ట్విట్టర్ లో తెలిపారు.
माननीय जनता,
मेरे इस्तीफ़े की बात ठीक उसी तरह अफ़वाह है, जैसे प्रधानमंत्री नरेंद्र मोदी मुझे इंटरव्यू देने के लिए तैयार हो गए हैं और अक्षय कुमार बंबइया आम लेकर गेट पर मेरा इंतज़ार कर रहे हैं।
आपका,
रवीश कुमार,
दुनिया का पहला और सबसे महँगा ज़ीरो टीआरपी ऐंकर అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. రవీష్ కుమార్ ఎన్డీటీవీకి రాజీనామా చేయలేదు.