Fact Check : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూగుల్ లో ట్రెండ్ అయ్యారా..?
Jagan did not Trend on Google Viral Claims are False. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యారని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2021 12:05 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యారని యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు వచ్చాయి. గూగుల్‌లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరును సెర్చ్ చేశారంటూ తెలుగు యూట్యూబ్ ఛానల్ 'ప్రజ చైతన్యమ్' వీడియోను అప్లోడ్ చేసింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా భారీగా ఫాలోయింగ్ ఉందని వీడియోలో పేర్కొంది. గూగుల్‌లో జగన్‌మోహన్ రెడ్డి గురించి నిమిషానికి 1000 మందికి పైగా శోధిస్తున్నారని వీడియో చెబుతోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి ఇటీవలే వెళ్ళినప్పుడు ఆయన గురించి శోధించే వ్యక్తుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. జగన్‌మోహన్ రెడ్డి గూగుల్‌లో ట్రెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. గూగుల్‌లో ఎపి సిఎం జగన్ గురించి నిమిషానికి 1000 మందికి పైగా శోధిస్తున్నట్లు తెలిపింది.
నిజ నిర్ధారణ:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి జూన్ 2021 లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ, అతను 2021 లో గూగుల్ లో ట్రెండ్ అవుతున్నాడని/అయ్యారనే వాదన నిజం కాదు. న్యూస్‌మీటర్ జూన్ 2021 లో గత కొన్ని రోజులుగా భారతదేశంలో గూగుల్ ట్రెండింగ్ లను తనిఖీ చేసింది.
జూన్ 2021 లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏ అంశం కూడా ట్రెండింగ్ లో కనుగొనలేదు.
భారతదేశం గూగుల్ ట్రెండింగ్ విషయాలు ఇక్కడ ఉన్నాయి.
https://trends.google.com/trends/trendingsearches/daily?geo=IN
గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, 2019 లో గూగుల్ వెబ్ సెర్చ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులలో అత్యధికంగా శోధించిన నాయకుడిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు వచ్చిందని.. పలు మీడియా సంస్థలు తెలిపాయి.
ఆ కాలంలో ప్రచురించిన నివేదికలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు వరుసగా రెండవ, మూడవ స్థానంలో ఉన్నారు. దాదాపు ఏడాది పొడవునా వైఎస్ జగన్ గూగుల్ సెర్చ్ లో చంద్రబాబు నాయుడు, పవన్‌లను ఓడించాడు. వైఎస్ జగన్ మొదటి ఆరు నెలల్లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాడు. వైఎస్ జగన్ ఎన్నికల్లో ప్రచారం చేసి, గెలిచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా విధులను చేబట్టారు. సంవత్సరం మొదటి అర్ధభాగంతో పోలిస్తే వైఎస్ జగన్ గురించి జూలై నుండి కాస్త తగ్గిందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తరువాత, జగన్ మోహన్ రెడ్డిని పొరుగున ఉన్న తమిళనాడులో ఎక్కువగా శోధించారు. పవన్, చంద్రబాబు నాయుడులను ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు.రాజకీయ నాయకుల ప్రసంగాలు, రాజకీయ వ్యాఖ్యల కంటే వారి పాటల కోసమే ఎక్కువగా శోధించారు. జగన్ కు భారీ ఫాలోయింగ్ తెచ్చిన పాట 'రావాలి జగన్ కావాలి జగన్' గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడుల రాజకీయ పాటల కోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారు.
గత ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారు. చంద్రబాబు నాయుడు తరువాత స్థానంలో ఉన్నారు. జగన్ కోసం సెర్చింగ్ 2018 చివరిలో మాత్రమే పెరిగాయి. యూట్యూబ్‌లో గత ఆరు నెలల్లో పవన్‌ని ఎక్కువగా శోధించారు. ఈ జాబితాలో జగన్ రెండవ స్థానంలో ఉన్నారు.
2020లో కూడా ఇలాంటి రిపోర్ట్ నే విడుదల చేశారు. చెక్‌బ్రాండ్స్ ప్రకారం సోషల్ మీడియాలో ట్రెండ్‌సెట్టర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై మొత్తం గూగుల్ ట్రెండ్స్ నివేదిక ఇక్కడ ఉంది. జగన్ మోహన్ రెడ్డి 2019 మరియు ఇతర సంవత్సరాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారని ఈ గ్రాఫ్ స్పష్టంగా చూపిస్తుంది. ఈ స్థాయిలో సెర్చ్ ను 2021 లో చూడలేదు.
https://trends.google.com/trends/explore?date=2019-01-01 2021-06-15&geo=IN&q=/m/04zz0v1
అందువల్ల 2021 లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన పేరు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అనే వార్తల్లో ఎటువంటి నిజం లేదు.