Fact Check : ఆసుపత్రి బెడ్ మీద ఉన్నది నటి పూనమ్ పాండేనా..?
Is this photo of Actor Poonam Pandey after she was assaulted by husband. నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2021 5:34 PM ISTనటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. పూనమ్‌పై దాడి చేసిన నేఫథ్యంలో ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ తల, కళ్ళు, ముఖంపై గాయాలయ్యాయి. ఆమె గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద సామ్ బాంబేపై కేసు నమోదు చేయబడిందని ముంబై పోలీసులు తెలిపారు. గత సంవత్సరం పెళ్లైన కొన్ని రోజులకే సామ్ బాంబే, పూనమ్ పై దాడి చేసినందుకు అరెస్టయ్యాడు. వీరిద్దరూ గోవాలో హనీమూన్‌లో ఉండగా.. పూనమ్ గృహహింస కేసు పెట్టింది. కొద్దిరోజులకు సామ్ బాంబే కు బెయిల్ రావడంతో పూనమ్ తిరిగి అతనితో జీవనం కొనసాగించింది. వివాహ బంధంలో ఇలాంటివి సహజం అని కూడా అప్పట్లో తెలిపింది.
यह C ग्रेड की पूनम पांडे है जो अक्सर अपने उल जुलूल हरकतों से सोशल मीडिया पर चर्चा में बनी रहती हैं
— ईश्वर वशिष्ट 🇮🇳 (@VashistIshwar02) November 10, 2021
यह हिंदुत्व को और हिंदुओं को हिंदू देवी देवताओं पर भी अभद्र टिप्पणी करती रहती है
फिर सेकुलरिज्म के ज्यादा चुल्ल मचने पर इन्होंने शमशाद अली उर्फ सैम बॉम्बे से निकाह किया
यह👇 pic.twitter.com/HLGRT7en4K
అయితే బెడ్ మీద ఓ యువతి ఉండగా.. ఆమె పూనమ్ పాండేనే అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.
यह C ग्रेड की पूनम पांडे है जो अक्सर अपने उल जुलूल हरकतों से सोशल मीडिया पर चर्चा में बनी रहती हैं यह हिंदुत्व और हिंदू देवी देवताओं पर भी अभद्र टिप्पणी करती रहती है
— मुंगेरीलाल (@mungeri89_lal) November 10, 2021
फिर सेकुलरिज्म के ज्यादा चुल्ल मचने पर इन्होंने शमशाद अली उर्फ सैम बॉम्बे से निकाह किया यह भूल गई कि शमशाद अली pic.twitter.com/98ATMnFWcl
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న యువతి పూనమ్ పాండే కాదు.
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, 24 సెప్టెంబర్ 2018న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొంది. టైటిల్‌లో "పూనమ్ పాండే | అర్ష పాండే హాస్పిటల్ వైరల్ వీడియో" "Poonam pandey | arsha pandey hospital viral video." అని ఉంది.
తేదీని క్లూగా ఉపయోగించి, న్యూస్‌మీటర్ 2018 ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నివేదికల కోసం తనిఖీ చేసింది. ఉత్తరాఖండ్‌లో పూనమ్ పాండే అనే మహిళ హత్యకు సంబంధించిన అనేక విషయాలను కనుగొంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు పయనీర్ ఆగస్టు 2018 నివేదికల ప్రకారం, ఒక మహిళ (పూనమ్ పాండేగా గుర్తించబడింది) దారుణంగా హత్య చేయబడింది, ఆమె కుమార్తె (అర్షి పాండేగా గుర్తించబడింది) అని తెలుస్తోంది. హల్ద్వానీలోని వారి ఇంటిని దోచుకున్న నేరస్థుల దాడిలో తీవ్రంగా గాయపడింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు వారి ఇంటిపై దాడి చేసి పూనమ్ పాండేని కాల్చి చంపారని నివేదికలు తెలిపాయి. ఆమె కుమార్తె అర్షిపై కూడా కాల్పులు జరిపారు.. ఆమెకు పలు గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరింది.
ఈ సంఘటనను అమర్ ఉజాలా మరియు జాగ్రన్ మీడియా సంస్థలు కూడా నివేదించారు. వైరల్ ఫోటోలో ఉన్న మహిళను హత్యకు గురైన మహిళ పూనమ్ పాండే కుమార్తె అర్షి పాండేగా తెలిపారు. వైరల్ ఫోటోలో ఉన్న మహిళ 'నటి పూనమ్ పాండే' కాదని స్పష్టంగా తెలుస్తుంది.
మోడల్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబే తన భార్యపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేయడంతో పాండేను ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. "భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద సామ్ బాంబేపై కేసు నమోదు చేయబడింది. నటి తల, కళ్ళు మరియు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి" అని ముంబై పోలీసు అధికారి మీడియాకి తెలిపారు.