Fact Check : రజనీకాంత్ మెడికల్ కాలేజ్ నిజంగానే ఉందా..?

Is the Rajnikant Medical College Real. 'రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ కామర్స్ అండ్ ఆర్ట్స్' పేరుతో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2021 10:15 AM GMT
Fact Check : రజనీకాంత్ మెడికల్ కాలేజ్ నిజంగానే ఉందా..?

'రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ కామర్స్ అండ్ ఆర్ట్స్' పేరుతో కళాశాల ప్రవేశ ద్వారం యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫోటోను షేర్ చేసిన ఒక ఫేస్బుక్ యూజర్ "ఇది భారతదేశపు కొత్త విద్యా విధానం. ఈ కళాశాలలో ఖచ్చితంగా ఏమి బోధించబడిందో ఎవరైనా వివరించగలరా?"

2011 నుండి సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లను ఇక్కడ చూడొచ్చు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు.

న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ది హిందూ బిజినెస్ లైన్ ద్వారా ఇదే విధమైన ఇమేజ్ కనుగొనబడింది. గేట్‌పై ఉన్న పేరు భువనేశ్వర్‌లోని జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మరియు కామర్స్ అండ్ ఆర్ట్స్ అని ఉంది. అది రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కాదు. అదే చిత్రాన్ని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రచురించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (XIMB) కాలేజీ మీద ఇలా ఎడిట్ చేసి 'రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ కామర్స్ అండ్ ఆర్ట్స్' అంటూ ఎడిట్ చేశారు.


న్యూస్ మీటర్ రెండు చిత్రాలను (వైరల్ అవుతున్నది- XIMB) పోల్చి చూసింది. రెండు చిత్రాలు ఒకే కళాశాలకు చెందినవని కనుగొన్నారు. XIMB ఫోటో మార్ఫింగ్ చేయబడింది మరియు 'రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ కామర్స్ అండ్ ఆర్ట్స్' అని తప్పుగా షేర్ చేయబడింది.


ఆన్ లైన్ లో XIMB గురించి సెర్చ్ చేయగా చాలా ఫోటోలు కనిపించాయి.


జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్ ఫోటోను మార్ఫింగ్ చేసి.. 'రజనీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ కామర్స్ అండ్ ఆర్ట్స్' అని తప్పుగా షేర్ చేయబడుతోంది. అందువల్ల వైరల్ అవుతున్న కథనాలు పచ్చి అబద్ధం.




Claim Review:రజనీకాంత్ మెడికల్ కాలేజ్ నిజంగానే ఉందా..?
Claim Fact Check:False
Next Story