ఐపీఎల్-2022 కి సంబంధించి మెగా వేలం కొద్దిరోజుల కిందటే చోటు చేసుకుంది. వేలంపాటలో పలువురు మాజీ క్రికెటర్లు, వ్యాపార దిగ్గజాలు, వారి వారసులు, ఫ్రాంచైజీ ఓనర్లైన సినిమా స్టార్ వారసులు పాల్గొన్నారు.
వినియోగదారులు అతన్ని బాలీవుడ్ నటుడు టికు తల్సానియా అని చెప్పడం మొదలుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులతో కలిసి ఒకాయన ఉండగా.. ఆ వీడియోలోని వ్యక్తి టికు తల్సానియా అని వినియోగదారులు పేర్కొన్నారు. న్యూస్‌మీటర్ వాట్సాప్‌లో వైరల్ వీడియోను అందుకుంది.
సోషల్ మీడియాలో కూడా పలువురు పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా డిసెంబర్ 02, 2021న క్రిక్ ట్రాకర్ ప్రచురించిన నివేదికకు దారితీసింది.
"ఐపీఎల్ మెగా వేలానికి వ్యతిరేకంగా కేకేఆర్ సిఇఒ వెంకీ మైసూర్ వ్యాఖ్యలు చేశారు" అనే శీర్షికతో నివేదిక వచ్చింది. ఈ నివేదిక కోల్‌కతా నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ చిత్రాన్ని ప్రచురించింది.
YouTubeలో కీవర్డ్ శోధన చేసాము.. ఫిబ్రవరి 12, 2022న YouTube ఛానెల్ 'ప్రేర్ణ న్యూస్'లో అప్‌లోడ్ చేయబడిన వీడియోకి దారితీసింది. వైరల్ వీడియోకు సమానమైన దృశ్యాన్ని 0:08 సెకన్ల నుండి చూడవచ్చు.
వెంకీ మైసూర్, టికు తల్సానియా మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్టులు తప్పు అని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి టికు తల్సానియా కాదు, కేకేఆర్ సిఇఒ వెంకీ మైసూర్.