పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్.. ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ఓ అమ్మాయి ఫోటో ఉంటుంది. పార్లేజీ అమ్మాయి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"ఈ పార్లేజీ అమ్మాయి చిత్రం ఆమె 3 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు క్లిక్ చేయబడింది. లైక్ చేసి షేర్ చేయండి" అని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ చిత్రంలో ఉన్నది భారతీయ రచయిత్రి సుధా మూర్తి అని చెప్పారు. సోషల్ మీడియా యూజర్లు ఆమెనే పార్లేజీ అమ్మాయి అని చెబుతూ వస్తున్నారు.
ట్విట్టర్ లో కూడా అలాంటి ఫోటోలే వైరల్ అవుతూ ఉన్నాయి. "పార్లేజీ గర్ల్ పిక్చర్ 1 సంవత్సరం 2 నెలల వయస్సులో ఉన్నప్పుడు క్లిక్ చేయబడింది. లైక్ చేసి షేర్ చేయండి" అనే క్లెయిమ్‌తో ట్వీట్ లను చూశాము.
పార్లే-జీ గర్ల్ క్లెయిమ్ కేవలం సుధా మూర్తి పేరుతో సర్క్యులేట్ అవడమే కాదు, నీరూ మరియు గుంజన్ గుండానియా పేర్లతో కూడా వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
పార్లేజీ గర్ల్ సుధామూర్తీ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
పార్లేజీ అమ్మాయి నిజానికి ఏ చిన్నారికి సంబంధించిన చిత్రం కాదు.. కానీ 60 వ దశకంలో ఎవరెస్ట్ సృజనాత్మకతతో రూపొందించారు. వైరల్‌గా సర్క్యులేటెడ్ ఇమేజ్‌లో ఉన్న మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారతీయ ఇంజనీరింగ్ టీచర్, కన్నడ, మరాఠీ మరియు ఆంగ్ల రచయిత్రి, సామాజిక కార్యకర్త సుధా మూర్తి. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కూడా. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఎకనామిక్ టైమ్స్ యొక్క ఒక కథనాన్ని మేము చూశాము. పార్లే ప్రొడక్ట్స్‌లోని గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా మాట్లాడుతూ ఇది నిజానికి 60 వ దశకంలో ఎవరెస్ట్ సృజనాత్మకతకు ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
"ఆమె పార్లేజీ బిస్కెట్ అమ్మాయి కాదు. పార్లే ప్రొడక్ట్స్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా గతంలో 60 వ దశకంలో ఎవరెస్ట్ క్రియేటివ్ ద్వారా తయారు చేసిన ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పారు. నిజంగానే ఆ పాపని ఫోటో తీసినట్లయితే ఆమె ఈ రోజు కనీసం 61+ సంవత్సరాలు పైగా ఉంటుందని భావించవచ్చు " అని ఫ్లోయిడ్ ట్వీట్ చూడొచ్చు.
Times of India లో వచ్చిన కథనం ప్రకారం.. ఈ ఫోటోలో ఉన్నది నిజమైన అమ్మాయికి చెందిన ఫోటో కాదు. పార్లే ప్రొడక్ట్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా మాట్లాడుతూ ఇది 60 వ దశకంలో ఎవరెస్ట్ క్రియేటివ్ ద్వారా తయారు చేయబడిన ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పడం ద్వారా అన్ని కథనాలను ఖండించారు.
పార్లే- G గర్ల్ అనేది నిజానికి ఏ పిల్లల ఇమేజ్ కాదు కానీ 60 వ దశకంలో ఎవరెస్ట్ సృజనాత్మకతతో చేసిన చిత్రణ. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.