Factcheck : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారా..?
Is Former Punjab Chief Minister Amarinder Singh Joining BJP. పంజాబ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుండి కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ఇటీవలే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Sept 2021 7:34 PM IST#BreakingNews #AmrinderSingh meets with amit sah.
— Lav Gupta (@lavguptabihiya) September 18, 2021
he will join bjp soon.
#AmarinderSingh pic.twitter.com/g0osptOscH
ఇంతలో అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారని కొందరు, చేరబోతున్నారని మరికొందరు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
"#BreakingNews #AmarinderSingh meets with Amit Shah. He will join BJP soon. #AmarinderSingh" అంటూ అమిత్ షాతో అమరీందర్ సింగ్ ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు.
"Breaking: Punjab CM and Congress leader Capt. Amarinder Singh in talks with Amit Shah to join BJP," అంటూ ఫేస్ బుక్ లో కూడా పోస్టులను చూడొచ్చు.
https://m.facebook.com/story.php?story_fbid=1228637684308015&id=100014853844123&sfnsn=wiwspwa
ఇలాంటి పోస్టులు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అదీ కాకుండా ఈ ఫోటోలు గతం లోవి..!
"Called on Home Minister @AmitShah Ji to take up with @pid_gov the issue of constructing an overbridge on Ravi for #KartarpurCorridor. My demand for a National Drugs Policy has highlighted the issue & @HMOIndia is working on a detailed & coordinated strategy for Punjab & J&K." అంటూ జూన్ 27, 2019న అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. దాదాపు రెండేళ్ల కిందటి ఫోటోను ఇప్పటిదా చెబుతూ ఉన్నారని న్యూస్ మీటర్ స్పష్టం చేసింది.
Called on Home Minister @AmitShah ji to take up with @pid_gov the issue of constructing an overbridge on Ravi for #KartarpurCorridor. My demand for a National Drugs Policy has highlighted the issue & @HMOIndia is working on a detailed & coordinated strategy for Punjab & J&K. pic.twitter.com/E7cEFv8Ncd
— Capt.Amarinder Singh (@capt_amarinder) June 27, 2019
"Delhi: Chief Minister of Punjab, Captain Amarinder Singh met Union Home Minister Amit Shah today," అంటూ 2019లో ఏఎన్ఐ వార్తా సంస్థ వీరి భేటీకి సంబంధించిన పోస్టును పెట్టడం గమనించవచ్చు.
Delhi: Chief Minister of Punjab, Captain Amarinder Singh met Union Home Minister Amit Shah today. pic.twitter.com/lYEmlBKXsm
— ANI (@ANI) June 27, 2019
The Hindusthan Times లో కూడా అప్పట్లో వీరి భేటీకి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది.
"సరిహద్దు వెంబడి రాష్ట్ర భద్రతకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థల నుండి రక్షణ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తక్షణమే సరిహద్దు భద్రతా దళానికి 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మరియు డ్రోన్ నిరోధక గాడ్జెట్‌లను అందించాలని కోరారు. " అంటూ కథనం ఉంది.
అప్పటి భేటీకి సంబంధించిన ఫోటోను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా మీడియాలో ఎటువంటి కథనాలు ఇటీవలి కాలంలో రాలేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అమరీందర్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన పాత చిత్రాలు ప్రస్తుతం తప్పుడు వాదనలతో షేర్ చేయబడుతున్నాయి.