ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ పలు భారతీయ భాషల్లో పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోనితా పాడిన వీడియోలను షేర్ చేసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కుమార్తె అని కూడా వ్యాఖ్యలు చేశారు.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను "Beautiful song of Priyanka Gandhi’s daughter Jonitta Gandhi. (sic)” అనే క్యాప్షన్‌తో షేర్ చేసారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియోలో ఏ మాత్రం నిజం లేదని న్యూస్ మీటర్ బృందం కనుగొంది.
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్ లో నిజం లేదని కనుగొంది. ప్రియాంక గాంధీ పబ్లిక్ బయో ప్రకారం.. ప్రియాంక గాంధీ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె మిరాయా వాద్రా, రైహాన్ వాద్రా అనే కుమారుడు ఉన్నారు.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా.. మేము మార్చి 1, 2023న YouTube ఛానెల్, BehindwoodsTV ద్వారా అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము.
జోనితా గాంధీ తొమ్మిది భాషల్లో పాటలు పాడారని ఆ వీడియో టైటిల్‌లో పేర్కొన్నారు.
జోనితా గాంధీ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ఆమె ఢిల్లీలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. జోనితా గాంధీ ప్రముఖ గాయనిగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె పలు భాషలలో పాటలను పాడింది. భారతీయ భాషలతో పాటు, ఆమె ఇటాలియన్, ఫ్రెంచ్ భాషలలో కూడా పాడగలదు.
జోనిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తనిఖీ చేసాము. ఆమె తన తల్లిదండ్రులు దీపక్ గాంధీ, స్నేహ గాంధీల పుట్టినరోజున వారి చిత్రాలను పోస్ట్ చేసినట్లు కనుగొన్నాము.
కాబట్టి, గాయని జోనితా గాంధీ ప్రియాంక గాంధీ కుమార్తె అనే వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam