Fact Check : ఆరిజోనాలో ట్రంప్ కు పడ్డ మెయిల్-ఇన్ బ్యాలట్ ఓట్లను చెత్తలో పడేశారా..?

Image of unopened mail-in ballots. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇటీవలే వచ్చాయి. ట్రంప్ ను కాదనుకుని

By Medi Samrat  Published on  15 Nov 2020 4:21 AM GMT
Fact Check : ఆరిజోనాలో ట్రంప్ కు పడ్డ మెయిల్-ఇన్ బ్యాలట్ ఓట్లను చెత్తలో పడేశారా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇటీవలే వచ్చాయి. ట్రంప్ ను కాదనుకుని జో బైడెన్ నే ఎన్నుకున్నారు ప్రజలు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ట్రంప్ కు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు ట్రంప్ మద్దతుదారులు.



"These are ballot papers stamped by Trump voters found dumped by side of the road in Arizona. It's a naked show by Liberals & Lefties in the US. The level of votes rigging in the US which no Data Analytics can calculate." అంటూ చెత్తలో పడేసిన బ్యాలట్ పేపర్లకు సంబంధించి పోస్టులు పెడుతున్నారు. ఆరిజోనాలో మెయిల్-ఇన్ బ్యాలట్స్ ను చెత్తలో పడేశారని.. ఇవన్నీ ట్రంప్ కు దక్కాల్సిన ఓట్లు అంటూ చెబుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంతో రిగ్గింగ్ చోటు చేసుకుందని ఆరోపిస్తూ ఉన్నారు. ట్రంప్ ఓడిపోవడానికి చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తూ వస్తున్నారు.

నిజ నిర్ధారణ:

ఆరిజోనాలో ట్రంప్ కు పడ్డ మెయిల్-ఇన్ బ్యాలట్ ఓట్లను చెత్తలో పడేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ దీనిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అచ్చం అలాంటి ఫోటోనే చూడొచ్చు. అధికారుల కథనం ప్రకారం మొత్తం 18 బ్యాలెట్లు ఆరిజోనాలోని 'గ్లెన్డేల్' లో కనిపించాయి. వీటికి సీల్ వేసే ఉంచారు. ఎవరూ ఓపెన్ చేయలేదు.



ఈ సమాచారాన్ని బట్టి కీ వర్డ్ సెర్చ్ చేయగా గ్లెన్డేల్ పోలీసు డిపార్ట్మెంట్ అందుకు సంబంధించిన ఓ వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. పోస్టల్ బ్యాలెట్లను తీసుకుని వస్తూ ఉండగా.. కొందరు దొంగతనం చేశారని తెలిపారు.

The 18 stolen ballots found in Glendale were returnedto voters just in time for the election అంటూ స్థానిక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఓపెన్ చేయలేదు.. కాబట్టి ట్రంప్ కు వేసిన ఓట్లను చెత్తబుట్టలో పడేశారు అంటూ వైరల్ అవుతున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదు. ఆరిజోనాలో ట్రంప్ కు పడ్డ మెయిల్-ఇన్ బ్యాలట్ ఓట్లను చెత్తలో పడేశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్.


Next Story