బీహార్ రాజకీయ నాయకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శ్రీకృష్ణుడి వేషధారణలో పిల్లనగ్రోవిని వాయిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఆయన ముందు ఓ మేక ఉంది.
అయితే పలువురు ఈ ఫోటోను ట్రోల్ చేస్తున్నారు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ కు శ్రీకృష్ణుడు మేకలను కాదు.. గోవులను ఆడించింది అనే విషయాన్ని తెలియజేయండి అని పలువురు పోస్టులను పెట్టడం మొదలుపెట్టారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుడు ఆదిత్య శర్మ ఇలా వ్రాశాడు: "శ్రీ కృష్ణుడు మేకలను కాదు, ఆవులను తన సంగీతంతో ఆడించేవారని ఎవరైనా ఈ తొమ్మిదో తరగతి ఫెయిల్ దుగ్గల్ భయ్యాకు చెప్పండి."
పలువురు సోషల్ మీడియాలో పలు రకాల ట్వీట్లను చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేయబడింది.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కృష్ణుడి వేషం ధరించిన తేజ్ ప్రతాప్ యాదవ్ యొక్క అసలు చిత్రం కనుగొనబడింది. ఈ చిత్రాన్ని 2019 డిసెంబరులో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "కృష్ణ విశ్వ సంగీతకారుడు, మరియు అతడి అతీంద్రియ వేణువును వాయించడం ద్వారా అతను సృష్టించే ట్యూన్ విశ్వ శక్తితో రూపొందించబడింది." అంటూ ఆ ఫోటో అప్లోడ్ చేయబడింది.
ఇన్‌స్టాగ్రామ్ చిత్రంలో కూడా మేక కనిపించలేదు. తేజ్ ప్రతాప్ యొక్క వీడియోను 'న్యూస్ నేషన్' డిసెంబర్ 2019 లో పోస్ట్ చేసింది. అందులో కూడా మేక కనిపించలేదు.
వైరల్ ఇమేజ్‌లో ఉన్న మేక యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇదే మేక ఫోటో అనేక వెబ్‌సైట్‌లలో ఉంది. దీనిని జెడి మార్ట్ మరియు పిఎన్‌జి జాయ్ సైట్ల వాళ్ళు కూడా ఉపయోగించారు. చిత్రం "పబ్లిక్ ఇంటర్నెట్ నుండి పూర్తిగా ఉచిత మెటీరియల్" మరియు ఇంటర్నెట్‌లో ఎవరైనా షేర్ చేయవచ్చు లేదా ఉపయోగించవచ్చు. అలా దొరికిన మేక ఫోటోను తేజ్ ప్రతాప్ ఫోటో ముందు మార్ఫింగ్ చేసి విమర్శలకు దిగారు.
కాబట్టి వైరల్ అవుతున్న ఫోటో 'మార్ఫింగ్ చేయబడినది'.