Fact Check : ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారా..?

Image of Injured Delhi MP Manoj Tiwari Shared with Misleading Claim. బీజేపీ ఢిల్లీ ఎంపి మనోజ్ తివారీ తల మరియు మెడకు బ్యాండేజ్‌తో ఉన్న చిత్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2021 4:00 PM GMT
Fact Check : ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారా..?

బీజేపీ ఢిల్లీ ఎంపి మనోజ్ తివారీ తల మరియు మెడకు బ్యాండేజ్‌తో ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో నిరసనకారులు అతన్ని కొట్టారని సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెట్టారు.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్‌మీటర్ మొదట గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. అక్టోబర్ 12, 2021 న వన్‌ఇండియా ఛానెల్‌లో ప్రసారమైన యూట్యూబ్‌లో వీడియోకి దారితీసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఒక ప్రదర్శన సమయంలో వాటర్ కెనాన్ తాకడంతో ఆసుపత్రిలో చేరారు. దేశ రాజధానిలో ఛత్ పూజ వేడుకలను నిషేధించే DDMA ఆదేశంపై తివారీ నిరసన తెలిపారు.


మనోజ్ తివారీ గాయపడిన సంఘటన అక్టోబర్ 12, 2021 న 'బౌండరీ లైన్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రసారం చేయబడింది. "ఢిల్లీలో ఛత్ పూజపై నిషేధానికి వ్యతిరేకంగా సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్న బిజెపి ఎంపి మనోజ్ తివారీ గాయపడ్డారు. అతడిని ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చారు "అని తెలిపారు.


"BJP MP Manoj Tiwari injured, admitted at Safdarjung hospital," అంటూ ఫ్యాక్ట్ చెక్ టీమ్ లు కూడా తెలిపాయి.

ఢిల్లీలో జరిగిన నిరసనలో మనోజ్ తివారి గాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలను నిషేధించాలని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట జరిగిన నిరసన కార్యక్రమంలో మనోజ్ తివారీ పాల్గొన్నారు. అతను ఇతర కార్మికులతో పాటు ఛత్ పూజ వేడుకలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

"ఢిల్లీ పోలీసులు సిఎం హౌస్‌ని అడ్డుకున్నారు. నిరసనకారులను సిఎం హౌస్‌కి రాకుండా నిరోధించారు. మనోజ్ తివారీ బారికేడ్ ఎక్కారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి నీటి ఫిరంగులను ఉపయోగించారు. మనోజ్ తివారీ బారికేడ్ నుండి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు" అని మీడియా సంస్థలు తెలిపాయి.

ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) నది ఒడ్డులు, రిజర్వాయర్లు మరియు దేవాలయాలతో సహా బహిరంగ ప్రదేశాలలో ఛత్ పూజ వేడుకలను COVID-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిషేధించింది. దీనిని బీజేపీ వ్యతిరేకించింది.

2021 అక్టోబర్ 14, 2021 న బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు మనీష్ సింగ్ చేసిన ట్వీట్‌ను న్యూస్ మీటర్ టీమ్ కనుగొంది. ట్వీట్‌లో, మనోజ్ తివారీ మరియు మొత్తం పూర్వాంచల్ కమ్యూనిటీ కలిసి వచ్చి ఆప్ ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినందుకు చోటు చేసుకున్న ఘటనల గురించి పోస్టు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న మనోజ్ తివారీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న చిత్రాలను కూడా పంచుకున్నారు.

ఆ తర్వాత ఆప్ ప్రభుత్వం ఈ బ్యాన్ ను ఉపసంహరించుకుంది.

జట్టు చివరగా మనోజ్ తివారీ తన ధృవీకరించబడిన ట్విట్టర్ హ్యాండిల్‌లో అక్టోబర్ 12, 2021 న ట్వీట్ చేసిన వీడియోను కనుగొన్నాము. ప్రజలు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభ్యర్థించారు. తివారీ బాగానే ఉన్నారని, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

ఆందోళనకారులు మనోజ్ తివారీని కొట్టారని ఎక్కడ కూడా చెప్పలేదు.

అందువల్ల వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేవని స్పష్టమవుతుంది. ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలో మనోజ్ తివారీ బారికేడ్ నుండి కిందపడి గాయపడ్డారు.


Claim Review:ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook Users
Claim Fact Check:False
Next Story