Factcheck : ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఫోటోను కేటీఆర్ తెలంగాణలో చోటు చేసుకుందని ట్వీట్ చేశారా..?

Image of Healthcare Workers Vaccinating Farmers is From AP Not Telangana. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తెలంగాణలోని ఆరోగ్య సంరక్షణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2021 12:22 PM GMT
Factcheck : ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఫోటోను కేటీఆర్ తెలంగాణలో చోటు చేసుకుందని ట్వీట్ చేశారా..?

మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తెలంగాణలోని ఆరోగ్య సంరక్షణ కార్మికుల నిస్వార్థ సేవను హైలైట్ చేస్తూ రెండు చిత్రాలను ట్వీట్ చేశారు.




ఓ చిత్రం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిందని, తెలంగాణ కాదని ప్రజలు తెలపడంతో వివాదానికి దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఈ చిత్రాన్ని తీసినట్లు చెబుతూ ఉన్న పేపర్ కటింగ్ ను కూడా కేటీఆర్ పోస్టు చేశారు.

ఆంధ్రప్రభలో కూడా అదే తరహా ఫోటోను పోస్టు చేయడం జరిగింది. ఉట్కూర్ మండలం నారాయణ పేటలో చోటు చేసుకుందని తెలిపారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ ఫోటో తెలంగాణలో చోటు చేసుకోలేదు.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు ఆ చిత్రం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినట్లు మేము కనుగొన్నాము. ఇది సెప్టెంబర్ 13, 2021 న ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ డెక్కన్ క్రానికల్‌లో ప్రచురించబడింది. ఈ చిత్రంలో విజయనగరం జిల్లాలోని మెంటాడ వద్ద వరి పొలాల్లో వ్యవసాయ కార్మికులకు టీకాలు వేసినట్లు తెలుస్తోంది.


ఆ ఫోటోను పలువురు ట్వీట్ కూడా చేశారు.

వైసీపీ నేత విజయసాయి రెడ్డి సెప్టెంబర్ 14న ట్వీట్ చేయడం కూడా జరిగింది.

"సిఎం జగన్ గారి స్ఫూర్తితో కోవిడ్ వ్యాక్సినేషన్ ను ఉద్యమంలా చేపట్టిన ఆరోగ్య సిబ్బందికి అభినందనలు. ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్లి పొలాల వద్ద టీకాలు ఇవ్వడం వారి అంకితభావాన్ని సూచిస్తుంది. విజయనగరం జిల్లాలో బురదలో నడుచుకుంటూ వెళ్లిన సిస్టర్లు రాష్ట్ర ప్రతిష్టను పెంచారు." అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ పవన్ ఈ ఫోటోను మొదట ట్వీట్ చేశారు. " #COVID19Vaccination at #workplace . Health staff in #vizianagaram district of #AndhraPradesh took #vaccination drive to fields & successfully administered to agriculture workers. According to officials, 62,000 people were vaccinated in 1 day today and 17 PHCs registered 100%." అంటూ ట్వీట్ లో ఫోటో ఉంది.

కేటీఆర్ చెప్పినట్లుగా ఈ ఫోటో తెలంగాణలో జరిగింది కాదు.


Claim Review:ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఫోటోను కేటీఆర్ తెలంగాణలో చోటు చేసుకుందని ట్వీట్ చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter User
Claim Fact Check:False
Next Story