FactCheck : గడ్డ కట్టిపోయిన ఐస్ లో బామ్మ ఉండడం నిజమైనది కాదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసింది

ఒక మహిళ ను ఐస్ లో బంధించారని పేర్కొంటూ ఒక చిత్రాన్ని సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2023 9:59 AM GMT
FactCheck : గడ్డ కట్టిపోయిన ఐస్ లో బామ్మ ఉండడం నిజమైనది కాదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసింది

ఒక మహిళ ను ఐస్ లో బంధించారని పేర్కొంటూ ఒక చిత్రాన్ని సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేశారు. బామ్మ మరణించిందని.. ఆమె మరణించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఐస్ లో భద్రపరిచారని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజమని నమ్ముతూ పోస్టులు పెడుతున్నారు.

“This family encased their deceased grandmother in resin and use her as a coffee table.” అంటూ పోస్టులు పెడుతున్నారు.

Reddit, 9gag వంటి సైట్స్ లో కూడా ఈ ఫోటోను గమనించాం.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ వైరల్ ఇమేజ్ ను AIతో రూపొందించినట్లు కనుగొంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తున్నప్పుడు, డెక్సెర్టో అనే వెబ్‌సైట్‌లో మేము ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సారూప్య చిత్రాన్ని కనుగొన్నాము. అందులో ఒక వ్యక్తికి బదులుగా, నవ్వుతున్న కుక్క కనిపించింది.

X వినియోగదారు కెల్లీ పోర్ట్ కు సంబంధించిన ఒక ట్వీట్ కూడా ఉంది. ఐస్ లో ఉన్న కుక్క చిత్రాన్ని రూపొందించినందుకు క్రెడిట్ తీసుకున్నాడు. ఆ X బయో ప్రకారం, అతను హాలీవుడ్ చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, ఇతర భారీ-బడ్జెట్ చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పని చేసారు.

రెసిన్ క్యూబ్ వెనుక ఉన్న కుటుంబం.. వైరల్ ఇమేజ్‌లో ఉన్న కుటుంబం కూడా ఒకటే..! దీంతో కెల్లీ పోర్ట్ కూడా ఆ చిత్రాన్ని రూపొందించారో లేదో తెలుసుకోవాలనుకున్నాము.

సెర్చ్ చేసే సమయంలో, మేము Xలో అదే వైరల్ చిత్రాన్ని చూశాము. కానీ ఈసారి రెసిన్‌లో ఉన్న మహిళ తన రెండు బొటనవేళ్లను చూపిస్తూ కనిపించింది.

అదే ట్వీట్‌లో.. ఒకే వ్యక్తి (@Urquwill), కెల్లీ పోర్ట్ తో రెండు చిత్రాల గురించి చర్చించారు. కామెంట్లలో @Urquwill కూడా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సమాచారంపై చర్చించారు.

“No problem for my part, can’t speak to what “@kellyport used to make the original image. My edits were just done in the new photoshop beta with AI generation.” అంటూ ట్వీట్ చేశారు.

'ఉమెన్ ఇన్ రెసిన్' చిత్రాన్ని కెల్లీ పోర్ట్‌కి ఆపాదించినప్పటికీ, ఒరిజినల్ క్రెడిట్‌ను కనుగొనలేకపోయాము. అయితే దీన్ని ఏఐతో జెనరేట్ చేశారని గుర్తించారు.

రెసిన్ బ్లాక్ లోపల ఉన్న స్త్రీ చిత్రం AI తో రూపొందించారని తెలిసింది.

Credits : Sunanda Naik

Claim Review:గడ్డ కట్టిపోయిన ఐస్ లో బామ్మ ఉండడం నిజమైనది కాదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసింది
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story