'పాకిస్తాన్ ముర్దాబాద్' స్టిక్కర్‌తో ఉన్న డస్ట్‌బిన్ యొక్క చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నీల్ కమల్ ఫర్నిచర్ కంపెనీ తమ డస్ట్‌బిన్‌లపై పాకిస్తాన్ వ్యతిరేక స్టిక్కర్లను అతికించి దేశభక్తిని ప్రదర్శించిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ పోస్టు ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా ఉంది.
న్యూస్‌మీటర్ మొదట కీవర్డ్ సెర్చ్ చేసింది, ఇది ఫిబ్రవరి 22, 2019 న 'పత్రిక' వెబ్‌సైట్‌లో వార్తను ప్రచురించిన ఘటనకు సంబంధించిన నివేదిక ఉంది. నివేదిక ప్రకారం కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జెండా స్టిక్కర్‌ని ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డస్ట్‌బిన్‌లపై అతికించారు. ఈ స్టిక్కర్లను ఎవరు, ఎప్పుడు పెట్టారో కూడా రైల్వే అధికారులకు తెలియదు. 'పత్రిక' ద్వారా తెలియజేయడంతో, అధికారులు చర్యలకు దిగారు మరియు చేతితో ఈ స్టిక్కర్లను తొలగించారు. స్టేషన్‌లో ఉంచిన 10 నుండి 12 డస్ట్‌బిన్‌ల నుండి స్టిక్కర్లను తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 22, 2019 న ఉదయపూర్ టైమ్స్ ప్రచురించిన మరొక నివేదికను కూడా మేము కనుగొన్నాము. డస్ట్‌బిన్‌లపై స్టిక్కర్లు అతికించిన వార్తలతో ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్ అధికారులు ఆశ్చర్యపోయారని నివేదిక పేర్కొంది. స్టిక్కర్లలో "పాకిస్తాన్ ముర్దాబాద్" అని ఉంది.
ఈ స్టిక్కర్లను ఎవరు డస్ట్‌బిన్‌లపై ఎప్పుడు అతికించారు అనే దానిపై అధికారులకు అంచనా లేదు. "పాకిస్తాన్ ముర్దాబాద్" అనే స్టిక్కర్లు పాకిస్తాన్ జెండాను కలిగి ఉన్నాయి. దీని గురించి అధికారులకు సమాచారం అందించినప్పుడు, వారు స్టిక్కర్లను క్షణంలో తీసివేశారు.
మేము అసలు నీల్ కమల్ డస్ట్‌బిన్ చిత్రాన్ని మరియు వైరల్ ఇమేజ్‌ని పోల్చాము. ఎక్కడా కూడా నీల్ కమల్ కంపెనీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్న స్టిక్కర్లతో డస్ట్ బిన్ ను తయారు చేయలేదు.
కాబట్టి వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదని స్పష్టమవుతుంది. డస్ట్‌బిన్‌లపై 'పాకిస్థాన్ ముర్దాబాద్' స్టిక్కర్‌లను 'నీల్ కమల్' ఫర్నిచర్ కంపెనీ అతికించలేదు.