భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్న్యా ఠాకూర్ ఆసుపత్రి స్ట్రెచర్ మీద ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అల్లోపతి ట్రీట్మెంట్ కోసం ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రగ్న్యా ఠాకూర్ మహారాష్ట్ర లోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరిందంటూ వైరల్ అవుతున్న ఈ ఫోటో ఇప్పటిది కాదు.
ప్రగ్న్యా ఠాకూర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇటీవలే ఆమెను కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వైరల్ ఫోటో మాత్రం ఇప్పటిది కాదు. The Week, India Today వంటి మీడియా సంస్థల కథనాల ప్రకారం.. ప్రగ్న్యా ఠాకూర్ కు ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించారని కథనాలు వచ్చాయి.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటో మాత్రం ఇప్పటిది కాదు.. 2013 సంవత్సరం, జనవరి నెల లోనిది. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకడంతో భోపాల్ లోని జవహర్ లాల్ నెహ్రూ క్యాన్సర్ ఆసుపత్రికి తరలిస్తున్న ఫోటో ఇది.
The Hindu ఈ వైరల్ ఫోటోను జనవరి 2013 లోనే పోస్టు చేసింది. సాధ్వి ప్రగ్న్యా సింగ్ ఠాకూర్ కు బ్రెస్ట్ క్యాన్సర్ సోకడంతో భోపాల్ లోని జవహర్ లాల్ నెహ్రూ క్యాన్సర్ ఆసుపత్రికి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం తరలించారని తెలిపారు. ఆమెకు అక్కడే బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన ట్రీట్మెంట్ ను ఇచ్చారు.
ఈ వైరల్ ఫోటో 2013 నుండి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. అంతేకానీ ఇటీవల ఆమె ఆసుపత్రి పాలైనప్పటి ఫోటో కాదు. ఇటీవలి కాలానికి చెందిన ఫోటో అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.