హార్ట్ షేప్ అంటే నిజమైన హార్ట్ షేప్ కాదు.. లవ్ సింబల్ లో ఉన్న ఓ చెరువుకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. దీన్ని 'గాడ్స్ హ్యాండ్' అంటారని.. జింబాబ్వేలో ఈ చెరువు ఉందంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజమేనని నమ్మేసి చాలా మంది ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోకు సంబంధించిన పలు ఫోటోలు లభించాయి. DreamsTime, Shutter Stock, Twenty 20, Alamy వంటి సంస్థల వద్ద ఒరిజినల్ ఫోటోలు ఉన్నాయి.
ఈ ఫోటో మరీ పూర్తిగా హార్ట్ షేప్ లో లేకున్నప్పటికీ కొద్దిగా పోలి ఉంది. అంతేకాకుండా ఇది జింబాబ్వేలో లేదు. రష్యాలో ఉంది. 'Kadykovsky quarry' అనే పేరుతో బలాక్ లావాలో (రష్యా) ఉంది. ఈ ఫోటోకు సంబంధించిన సమాచారాం ఓ వెబ్ సైట్ లో "Blue heart-shaped lake, Kadykovsky quarry, Balaklava, Sevastopol, Crimea, Russia '' ఇలా ఉంది.
ఒక ట్రావెల్ బ్లాగ్ ప్రకారం, కడికోవ్స్కీ సెవాస్టోపోల్ శివార్లలోని చుట్టుపక్కల కొండల మధ్య వదిలివేయబడిన క్వారీ ఇది. క్వారీని `కడికోవ్కా 'అంటారు. క్వారీ గత శతాబ్దంలో ఉపయోగించారు, తరువాత వదిలేశారు. ఇది నెమ్మదిగా నీటితో నిండి, సముద్ర మట్టానికి దిగువన నీలం-ఆకుపచ్చ నీటితో ఉంది.
న్యూస్‌మీటర్ గూగుల్ మ్యాప్స్‌లో కూడా వెతికి అదే చిత్రాన్ని కనుగొంది. వైరల్ చిత్రంలోని గుండె ఆకారపు చెరువు రష్యాలో ఉందని ఇది సూచిస్తుంది. ఇక జింబాబ్వేలో "గాడ్స్ హ్యాండ్" అనే చెరువు లేదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.