పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు సుల్తాన్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నాయకురాలు రీటా యాదవ్ నల్లజెండా చూపించి వార్తల్లో నిలిచారు. అయితే ఆమె సుల్తాన్‌పూర్‌లోని డయారా ఓవర్‌బ్రిడ్జి సమీపంలో కొందరు ఆమెపై దాడి చేయడంతో ఆమె గాయపడింది.

ఆ ఘటనకు లింక్ పెడుతూ.. ఓ మహిళ ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఫోటోను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. ఆ మహిళను రీటా యాదవ్‌గా గుర్తించారు. వినియోగదారులు ఆమెను కాల్చి చంపారని చెబుతున్నారు. "సుల్తాన్‌పూర్ ర్యాలీలో ప్రధాని మోదీకి నల్లజెండా చూపించిన మహిళ రీటా యాదవ్‌ను కాల్చి చంపారు" అని సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ ఈ సంఘటనపై అనేక నివేదికలను పరిశీలించింది. కానీ రీటా యాదవ్‌ను కాల్చి చంపిన ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు.

వైరల్ చిత్రం రీటా యాదవ్ ఆసుపత్రి బెడ్‌పై పడుకున్నట్లు చూపిస్తుంది. ఆమె కుడి కాలుకు తూటా గాయమైంది.

రీటా యాదవ్ ఇంటికి తిరిగి వస్తుండగా, మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు సాయుధులు లక్నో-వారణాసి హైవేపై ఆమె డ్రైవర్‌ను బలవంతంగా ఆపారు. ఆ తర్వాత ఆమె కుడి కాలుకు కాల్పులు జరిపారు. స్థానిక సిహెచ్‌సి ఆసుపత్రికి తీసుకువచ్చారు.

యాదవ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో కాల్పుల సంఘటనను వివరించారు. రాజకీయ కక్షతోనే ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని యాదవ్ చెప్పారు. సంఘటనకు ముందు, ఆమె కాంగ్రెస్ కోసం పోస్టర్లు, బ్యానర్లు తీసుకురావడానికి సుల్తాన్‌పూర్ మార్కెట్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుండగా, మోటారుసైకిల్‌పై ముగ్గురు యువకులు డ్రైవర్‌ను బలవంతంగా ఆపి, SUV తలుపు తెరిచి షూటింగ్ ప్రారంభించారు.

"నా కాలికి బుల్లెట్ తగిలింది. తర్వాత వాళ్ళు పారిపోయారు" అని ఆమె చెప్పింది. సుల్తాన్‌పూర్‌లోని లంబువా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇంకా అరెస్టులు జరగలేదు. యాదవ్ ఆసుపత్రిలో ఉన్నారని, ప్రమాదం నుండి బయటపడ్డారన్నారు.

(Source: Indian Express, Jagran, Jansatta)

అయితే.. రీటా యాదవ్ బతికే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. రీటా యాదవ్‌ను కాల్చి చంపారనే వాదన తప్పు.


Claim Review :   కాంగ్రెస్ మహిళా నేత రీటా యాదవ్ ను కాల్చి చంపారా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story