లక్నో గర్ల్.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపించిన పేరు..! ఓ క్యాబ్ డ్రైవర్ ను అనవసరంగా కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనను హింసించారంటూ సదరు యువతి మీడియా ముందు చెప్పుకొచ్చింది. కానీ వైరల్ అయిన వీడియోల ద్వారా లక్నో అమ్మాయిదే తప్పు ఉందని స్పష్టంగా తెలుస్తోందని పలువురు ఆరోపించారు.
తాజాగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో లక్నో గర్ల్ ను పోలీసులు అరెస్టు చేశారు అంటూ ఉంది.
"Lucknow girl finally arrested," అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఫేస్ బుక్ లో పలువురు లక్నో గర్ల్ ను అరెస్టు చేశారంటూ వీడియోలను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
లక్నో గర్ల్ ను పోలీసులు అరెస్టు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ లలో ఉన్న అమ్మాయి ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ కాదు.. రాజస్థాన్ లేడీ డాన్ అనురాధా చౌధరి.
ప్రియదర్శిని యాదవ్ ఎవరు..?
ఇటీవల ప్రియదర్శిని యాదవ్ అనే పేరు దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఎందుకంటే లక్నో నడి రోడ్డు మీద ఆమె ఓ క్యాబ్ డ్రైవర్ ను అకారణంగా కొట్టింది. ఇతరులు ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆమె క్యాబ్ డ్రైవర్ ఫోన్ ను పగులగొట్టి.. నడిరోడ్డు మీద రచ్చ రచ్చ చేసింది.
పలు యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ లో ఈ వీడియోలను టెలికాస్ట్ చేశారు.
యూట్యూబ్ వీడియోలలో మేము కొన్ని కీఫ్రేమ్‌లను కనుగొన్నాము. వీడియోలో ఉన్న మహిళ 'రాజస్థాన్ డాన్' అనురాధ చౌదరి, గ్యాంగ్‌స్టర్ అయిన కాలా జటేది యొక్క సహచరురాలు. ఆమె లక్నో అమ్మాయి ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ కాదు.
లక్నో పోలీసులు ప్రియదర్శినిని అరెస్టు చేయలేదని నిర్ధారించిన ఇండియా టుడే కథనాన్ని కూడా మేము చూశాము.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు sinceindependence.com ద్వారా "Woman don Anuradha Chaudhary alias Anurag alias Madam Minz, was arrested from Saharanpur in Uttar Pradesh" అన్నది కనుకున్నాము. కాబట్టి లేడీ డాన్ ను అరెస్ట్ చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. నేషనల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన కథనాలను చూడొచ్చు.
Patrika.com పోస్ట్ చేసిన ఇలాంటి చిత్రాన్ని మేము కనుగొన్నాము
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. వైరల్ అయిన వీడియోలో ఉన్న అమ్మాయి ప్రియదర్శిని నారాయణ్ యాదవ్ కాదు, రాజస్థాన్ లేడీ డాన్ అనురాధ చౌదరి.