Fact Check : గురుద్వారా కమిటీ మోదీ వస్తున్నారని కావాలనే కార్పెట్ ను తీసేసిందా..?

Gurudwara committee did not remove carpet for PM. పార్లమెంట్ లో పాస్ అయిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు

By Medi Samrat  Published on  26 Dec 2020 3:57 PM IST
Fact Check : గురుద్వారా కమిటీ మోదీ వస్తున్నారని కావాలనే కార్పెట్ ను తీసేసిందా..?

పార్లమెంట్ లో పాస్ అయిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవలే డిసెంబర్ 20న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ లోని రాకబ్ గంజ్ గురుద్వారాను దర్శించుకున్నారు.



ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. గురుద్వారా ముందు మోదీ నడుస్తూ ఉన్నట్లుగా ఆ ఫోటోలో ఉంది. 'నరేంద్ర మోదీ ఢిల్లీ లోనే లోని గురుద్వారాను దర్శించారు. ఆ సమయంలో గురుద్వారా కమిటీ కార్పెట్ ను కావాలనే తీసేసిందనని అన్నారు. ఢిల్లీ చలికి మోదీ చెప్పులు లేకుండానే నడవాలన్నది వారి ఉద్దేశ్యం అని.. మోదీ తిరిగి వెళ్లే వరకూ ఆయన వెంట ఎవరూ లేరని.. ఓ ప్రధానికి ఇచ్చే మర్యాద ఇదేనా' అంటూ విమర్శలు గుప్పించారు.

నిజ నిర్ధారణ:

నరేంద్ర మోదీ వస్తున్నారని గురుద్వారా కమిటీ కార్పెట్ తీసేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వార్తా కథనాల ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని విధంగా గురుద్వారాను సందర్శించారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ సాహిబ్‌ను సంద‌ర్శించారు. సిక్కు మ‌త బోధ‌కుడు గురు తేజ్‌ బహదూర్ కు నివాళులర్పించి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. షెడ్యూల్‌లో లేని ప‌ర్య‌ట‌న కావ‌డంతో.. ఎలాంటి బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు. నారింజ రంగు జుబ్బాతో పాటు దానిపై ఆరెంజ్ రంగు కోటు, తెలుపు పైజామాతో ఆయన గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. పూజా సామగ్రిని అక్కడ మతగురువుకు మోదీ అందించారు.

ప్రధాని ట్విట్టర్‌లో గురు తేజ్‌ బహదూర్ సింగ్ సేవలను కొనియాడారు. గురు తేగ్ బహదూర్ సింగ్ జీవితం ఎంతో ఆదర్శనీయమన్నారు. ఆయన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మా ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే తేజ్ బ‌హ‌దూర్ 400వ ప్రకాశ్ ప‌ర్వ్ రావ‌డం ఆయ‌న దీవేన‌గా భావిస్తున్నాన‌ని.. ఆయ‌న అంతిమ సంస్కారాలు జ‌రిగిన ఈ ప‌విత్ర స్థ‌లాన్ని నేడు సంద‌ర్శించ‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నాన‌ని తెలిపారు. ఈ గురుద్వారా పార్లమెంట్ హౌస్ కు అతి దగ్గరలోనే ఉంది.

https://www.hindustantimes.com/india-news/pm-modi-makes-surprise-visit-to-historic-delhi-gurdwara-offers-prayers/story-4UEy1hnfQlLj1Mh70nEoFJ.html

ఆయన పర్యటనకు సంబంధించి పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి. ఈ పర్యటన చాలా సాదా సీదాగా సాగిపోయింది. ఓ దేశ పౌరుడిలా ఆయన గురుద్వారాకు వెళ్లి వచ్చారు.


న్యూస్ మీటర్ పలు మీడియా సంస్థలకు సంబంధించిన వీడియోలను పరిశీలించగా నరేంద్ర మోదీ కావాలనే పక్క నుండి నడుచుకుంటూ వెళ్లిపోయారు. కార్పెట్ మీద నడవకుండా ఆయన వెళ్లారు. ఆలయ కమిటీ కార్పెట్ ను తీసేసింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.



నరేంద్ర మోదీ కూడా తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.



నరేంద్ర మోదీ వస్తున్నారని గురుద్వారా కమిటీ కార్పెట్ తీసేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.


Next Story