FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?

2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 March 2024 8:30 PM IST
FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?

2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షిస్తోందని.. రాజకీయంగా పోస్ట్ లు పెట్టడంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందంటూ.. ప్రజలను హెచ్చరించే ఫేస్‌బుక్ సందేశం వైరల్ అవుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా పోస్టు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ పోస్టులో తెలిపారు.

మార్చి 16 న ECI ప్రకటనతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులోకి వచ్చింది. రాజకీయ పార్టీలు, నాయకులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.


వైరల్ సందేశంలో, “ఈ రోజు నుండి, లోక్‌సభకు ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌, లింక్డ్‌ఇన్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, పిన్‌టెరెస్ట్ మొదలైనవన్నింటినీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని గ్రూప్‌లోని సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి లేదా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఏదైనా ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసినా బాధ్యత వహిస్తారు. రాజకీయంగా ప్రేరేపించిన పోస్ట్‌లతో సహా ఎలాంటి అవమానకరమైన ప్రకటనలు లేదా పోస్ట్‌లు చేయవద్దని మీకు సూచిస్తున్నాం. కాబట్టి మీరు అలాంటి పోస్ట్‌లను సర్క్యులేట్ చేయవద్దని లేదా పోస్ట్ చేయవద్దని కోరుతున్నాం." అంటూ ఉంది.

నిజ నిర్ధారణ :

సోషల్ మీడియాలో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సాధారణ ప్రజలు ఏదైనా పోస్ట్ చేయడాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద పరిగణిస్తారనే వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.

భారత ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను మేము పరిశీలించాం. మార్గదర్శకాలను ఏడు విభాగాలుగా విభజించారు. సాధారణ ప్రవర్తన, సమావేశాలు, ఊరేగింపులు, పోలింగ్ రోజులు, పోలింగ్ బూత్‌లు, అధికారంలో ఉన్న పార్టీ, ఎన్నికల మ్యానిఫెస్టోలపై మార్గదర్శకాలు వంటి వాటిని గమనించాం.

సెక్షన్‌లలోని మార్గదర్శకాలు ఏవీ వ్యక్తిగత ఓటర్లు లేదా ఎన్నికల అభ్యర్థులకు కానీ సాధారణ ప్రజల కోసం ఉద్దేశించలేదు. రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉన్న రాజకీయ నాయకులు, క్యాడర్‌ల కోసం కూడా సూచనలు లేదు. వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా 'ప్రభుత్వానికి లేదా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఏదైనా ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా' ఏదైనా పోస్ట్ చేసినందుకు చట్టపరమైన చర్యల గురించి ECI హెచ్చరించలేదు.

ఏది ఏమైనప్పటికీ.. ఒకరిని తప్పుగా చూపడానికి రాజకీయ నాయకులు, పార్టీలపై 'అవమానకరమైన' పోస్ట్‌లు చేయడం ఎల్లప్పుడూ చట్టం ప్రకారం శిక్షలు ఎదుర్కోడానికి కారణం అవుతుంది. ఇవన్నీ 'రాజకీయ ప్రేరేపిత పోస్ట్‌లకు’ భిన్నమైనవి.

మార్చి 16, 2024న ప్రచురించిన “Myth Vs Reality’s project to be launched to counter fake news, misinformation during Lok Sabha polls: ECI Chief”అనే టైటిల్ తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన నివేదిక ద్వారా మరిన్ని వివరాలను మేము తెలుసుకున్నాం.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ “ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే స్వేచ్ఛ ఉంది. కానీ ఒక నకిలీ వార్తలను సృష్టించడాన్ని అనుమతించకూడదు" అని తెలిపారు.

ఐటీ చట్టంలోని సెక్షన్లు 69, 79 ప్రకారం తప్పుడు సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించాలని రాష్ట్ర అధికారులను కోరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అందువల్ల, సోషల్ మీడియాలో రాజకీయ పోస్ట్‌లు చేయవద్దని ప్రజలను హెచ్చరిస్తున్న సందేశం నకిలీదని మేము నిర్ధారించాము.

Credits : Sunanda Naik

Claim Review:సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story