ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ ఇస్తే టవల్ వచ్చిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే..! ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆలిక్ పెరెజ్ అనే మహిళ తన కుమారుడి కోసం ఆన్‌లైన్‌లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ అనే రెస్టారెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ తెరిచి కత్తితో ఓ ముక్క కత్తిరించాలని ప్రయత్నించింది. చాలా బలంగా ఉండడంతో ఏంటని పూర్తిగా తెరిచి చూడగా డీప్ ఫ్రై చేసిన టవల్ వచ్చింది. దానితో పాటు నిమ్మకాయ, ఉల్లిపాయాలు కూడా వచ్చాయి. ఈ ఘటనపై జొల్లిబీ రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ బొనిఫసియో గ్లోబల్ సిటీలోని మా రెస్టారెంట్‌ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నామని.. జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నామని తెలిపింది. దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నామని అన్నారు.
https://www.hindustantimes.com/trending/woman-orders-fried-chicken-in-philippines-receives-a-towel-instead-watch-101623035043692.html
అయితే మెక్ డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ సంస్థ ఈ ఫ్రైడ్ టవల్ ఘటనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టునట్లుగా ఓ ఇమేజ్ వైరల్ అవుతూ ఉంది. "Our competitor threw in the towel" అంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. మెక్ డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ సంస్థ తన ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టాలని ఇలా పోస్టును డిజైన్ చేయించిందని పలువురు నమ్ముతూ ఉన్నారు.
దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
మెక్ డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ సంస్థ తమ ప్రత్యర్థిని ఇరకాటంలో నెడుతూ ఇలా పోస్టు పెట్టిందనే వార్తలో 'ఎటువంటి నిజం లేదు'. ఇలాంటి యాడ్ ను తాము తయారు చేయలేదని.. తయారు చేయం కూడా అని మెక్ డొనాల్డ్స్ సంస్థ తెలిపింది.
జూన్ 4 న, మెక్ డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ వైరల్ ఫోటోలో తమ ప్రమేయం లేదని తెలిపింది. ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ సీనియర్ మేనేజర్ ఆది టింబోల్-హెర్నాండెజ్ మాట్లాడుతూ, "మెక్‌డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ ఏ బ్రాండ్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన విషయాలను ఉత్పత్తి చేయలేదు, విడుదల చేయలేదు. ఈ కంటెంట్‌ను మెక్‌డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ తయారు చేయలేదు, దేనినీ డిజిటల్ మీడియాలో పోస్టు చేయలేదు' అని తెలిపారు.
https://news.abs-cbn.com/business/06/04/21/viral-towel-post-not-made-by-mcdonalds-philippines
https://www.philstar.com/lifestyle/food-and-leisure/2021/06/04/2103104/mcdonalds-clarifies-threw-towel-viral-photo-about-jollibee-fried-towel-incident
ఫిలిప్పీన్స్ కు చెందిన పలు మీడియా సంస్థలు.. ఈ వైరల్ ఫోటోను మెక్‌డొనాల్డ్స్ సంస్థ ప్రచురించలేదని తెలిపాయి.
ఈ ఘటనలో మెక్‌డొనాల్డ్స్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టును 'మెక్‌డొనాల్డ్స్' సంస్థ తయారు చేయలేదు.