ఓ చిన్న సర్వే చేస్తే చాలు.. ఓ పది మందికి షేర్ చేస్తే చాలు లక్కీ విన్నర్ మీరే అయిపోతారంటూ పలు పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న గిఫ్టులతో పాటూ.. లక్షల విలువైన వస్తువులు కూడా సొంతం చేసుకోవచ్చు అంటూ పలు సంస్థలకు చెందిన ప్రోడక్ట్స్ విషయంలో ఇప్పటికే మెసేజీలు వైరల్ అయ్యాయి.
తాజాగా టాటా సంస్థకు చెందిన 'సఫారీ' కారు కొత్త మోడల్ సొంతం చేసుకోవచ్చని.. ఆ లక్కీ ఛాన్స్ మీకే వరిస్తుందంటూ ఓ మెసేజీ వైరల్ అవుతోంది. ఆ లింక్ ను ఓపెన్ చేస్తే చిన్న పాటి సర్వే మొదలవుతుంది. ఆ తర్వాత ఇతరులకు షేర్ చేయమని అందులో కోరారు.
నిజ నిర్ధారణ:
టాటా సఫారీ ఇస్తామని వైరల్ అవుతున్న మెసేజీ 'అసలు నిజం కానే కాదు'. టాటా మోటార్స్ సంస్థ అలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. వీటి మీద క్లిక్ కూడా చేయకండి.
వైరల్ అవుతున్న లింక్ మీద టచ్ చేస్తే ఓ 'అన్ రికగ్నైజ్' వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ లో టాటా మోటార్స్ కు సంబంధించిన లోగో కూడా కనిపించదు. అలాగని మెయిన్ పేజీలోకి కూడా వెళ్లదు. గతంలో వైరల్ అయిన లింక్స్ లాగే ఇందులో కూడా కొన్ని ప్రశ్నలను అడగడం.. గిఫ్ట్ వచ్చిందని చెప్పడం.. ఇతరులకు షేర్ చేయడం అన్నది జరుగుతోంది. లింక్ మొత్తం ఫేక్ అని న్యూస్ మీటర్ కు స్పష్టంగా తెలిసిపోయింది. ఐపీ అడ్రెస్ కూడా ఫేక్ అని స్పష్టమవుతోంది. ఇలాంటి లింక్ లపై క్లిక్ చేయడం ద్వారా డేటా మొత్తం కొట్టేయడమే కాకుండా.. సెక్యూరిటీ బ్రీచ్ అన్నది కూడా జరుగుతుంది. మీ డేటా మొత్తం కూడా కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ సంస్థ ఉచితంగా టాటా సఫారీని ఇస్తూ ఉందని ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా జరగలేదు. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఇలాంటి పోస్టులను పెట్టలేదు. కాబట్టి ఇలాంటి లింక్ మీద క్లిక్ చేయకపోవడమే చాలా బెటర్ అని తెలుస్తోంది.
న్యూస్ మీటర్ ఈ వైరల్ మెసేజీపై టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులను సంప్రదించగా.. ఇందులో ఎటువంటి నిజం లేదని తెలిపారు. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మకండని.. వీటిపై క్లిక్ కూడా చేయకండని హెచ్చరించారు.
టాటా సంస్థ ఉచితంగా 'టాటా సఫారీ' కార్లను ఇస్తూ ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.