"చైనాలో వాటర్ ఫౌంటెన్ భగవద్గీత మ్యూజిక్ కు అనుగుణంగా అద్భుతంగా అమర్చారు చూచి ఆనందించండి" అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
https://web.archive.org/web/20220704175943/https:/twitter.com/ShailajaReddi/status/1543465292843495424
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ వైరక్ పోస్ట్ అబద్ధమని గుర్తించింది.
పోస్ట్‌లో ఉన్న వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, వీడియోపై చైనీస్ భాషలో వ్రాసిన లోగో కనిపిస్తుంది.
దాన్ని అనువదించగా 'టెన్సెంట్ వీడియో' అని ఉంది. మేము వెబ్‌లో శోధించగా.. 'v.qq.com' అనే చైనీస్ వెబ్‌సైట్‌లో అవే దృశ్యాలతో కూడిన వీడియో కనుగొనబడింది. వీడియో వివరణలో చైనాలోని వుక్సీలో నిర్మించిన లింగ్ షాన్ మ్యూజికల్ ఫౌంటెన్‌లోని అతిపెద్ద బుద్ధ విగ్రహం దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియోలో ఎక్కడా భగవద్గీత సంగీతం లేదు. అసలు వీడియో 2016లో యూట్యూబ్ యూజర్ ద్వారా పోస్ట్ చేయబడింది.
లింగ్ షాన్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శనకు సంబంధించిన మరికొన్ని వీడియోలను మేము కనుగొన్నాము.
కొన్ని ఆడియో బిట్‌లతో అదే వీడియో యొక్క ఇతర ఎడిటెడ్ వీడియోలను కూడా కనుగొన్నాము. ఒరిజినల్ వీడియోకు భిన్నంగా ఆడియోలు జోడించబడ్డాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు తప్పు. పోస్ట్‌లో షేర్ చేయబడిన వీడియో ఎడిట్ చేయబడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.