అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో తుపాకీలతో నిండిన షాపింగ్ కార్ట్‌ను నెట్టుతున్న చిత్రాన్ని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసారు.
ట్రోల్ ఫుట్‌బాల్ అనే సోషల్ మీడియా వినియోగదారు పేరుతో ధృవీకరించబడిన ఖాతా నుండి ఒక ట్వీట్ ప్రకారం, "మెస్సీ ఇప్పటికే అమెరికన్ సంస్కృతిని స్వీకరించారు." అంటూ ట్వీట్ చేశారు.
మరొక ఫేస్ బుక్ పోస్టులో “Messi has already adopted the American culture by buying guns just to threaten refs if they refused to give him penalty. (sic)” అంటూ పోస్టు చేశారు.
వైరల్ చిత్రం మయామికి సంబంధించినదని పేర్కొంటూ మేము మరొక పోస్ట్‌ను కూడా కనుగొన్నాము.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టును ఫోటో షాప్ చేశారని తేలింది.
అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ అమెరికన్ జట్టు ఇంటర్ మయామి కోసం ఆడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ చిత్రం వచ్చింది. తుపాకులతో నిండిన షాపింగ్ కార్ట్‌తో మెస్సీ 'అమెరికన్ జీవన విధానానికి' అలవాటు పడ్డారని.. వైరల్ ఇమేజ్ ద్వారా చెప్పుకొచ్చారు. అమెరికా అంటే గన్ కల్చర్ కాబట్టి అందుకు తగ్గట్టుగా సెటైర్లు వేశారు.
మెస్సీ గన్స్ ను కొంటున్నట్లుగా చూపించే సంబంధిత చిత్రాలను లేదా మీడియా నివేదికలను కనుగొనడానికి వెబ్‌లో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము.. కానీ ఎటువంటి వార్తలను అందించలేకపోయాము. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా, మేము జూలై 14, 2023న ప్రచురించిన డైలీ మెయిల్ మీడియా రిపోర్ట్ గుర్తించాం.
ఒరిజినల్ రిపోర్టులో వైరల్ ఇమేజ్ కు సంబంధించి.. లియోనెల్ మెస్సీ తన కుటుంబంతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించాడు. అసలు చిత్రంలో తుపాకులు లేవు. మెస్సీ రోజువారీ అవసరాల కోసం షాపింగ్ చేయడం చూడవచ్చు.
రెండు చిత్రాలకు సంబంధించిన పోలికను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని తెలుస్తోంది. మెస్సీ ఎక్కడా గన్స్ ను షాపింగ్ చేయలేదు.
Credits : Sunanda Naik