నిజమెంత: ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?

బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని దీన్ని షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 March 2024 7:30 AM
NewsMeterFactCheck,BJP, Telangana, Odisha

నిజమెంత: ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?

బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని దీన్ని షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా 400 లోక్ సభ సీట్లను సాధించాలని భావిస్తోంది. ఆ లక్ష్యంలో భాగంగా పలు రాష్ట్రాలలో చాలా పార్టీలను కూటమిగా చేసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత అలాగే ఉంది. అందుకే ఒడిశాలో ఇలా బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారంటూ ప్రచారం చేస్తున్నారు.

పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. (ఇక్కడ, ఇక్కడ క్లిక్ చేయండి)

నిజ నిర్ధారణ:

ఆ వీడియో 2022లో తెలంగాణకు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. అదే వీడియో (ఆర్కైవ్)ని ట్విట్టర్ లో మేము కనుగొన్నాము. నవంబర్ 1, 2022 న ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో తెలంగాణలో BJPకి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని చూపుతుందనే శీర్షికతో వీడియోను షేర్ చేస్తున్నారు.

బీజేపీ తెలంగాణకు చెందిన X హ్యాండిల్.. నవంబర్ 1, 2022న మరో వీడియోను షేర్ చేసింది. ఇందులో కొందరు బీజేపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేస్తూ ఉండడం చూపుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఈ లీడ్స్‌తో.. మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. టైమ్స్ నౌ (ఆర్కైవ్) నవంబర్ 2, 2022న ‘తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు’ అనే శీర్షికతో ప్రచురించిన అదే విజువల్స్‌ను చూపే వీడియోను మేము చూశాము.

ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?

ఛానెల్ ప్రకారం, తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో చివరి దశలో ఉన్న సమయంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

నవంబర్ 1, 2022న 'మునుగోడులో ఈటెల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి' పేరుతో V6 న్యూస్ తెలుగు ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోలో వైరల్ క్లిప్‌ని మేము కనుగొన్నాము. ఈ వీడియోలో వైరల్ క్లిప్ 25:22 నిమిషాల టైమ్‌స్టాంప్ తర్వాత కనిపిస్తుంది.

బీజేపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల వైరల్ వీడియో తెలంగాణకు చెందినది. నవంబర్ 2022లో ఈ ఘటన చోటు చేసుకుందని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.

Claim Review:ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోంది.
Claimed By:X and Facebook users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Facebook
Claim Fact Check:Misleading
Next Story