నిజమెంత: బెంగళూరు రహదారిపై కరెంట్ వైర్ కారణంగా మంటలు చెలరేగాయంటూ పోస్టులు వైరల్

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2024 5:14 AM GMT
Bengaluru, Rains, Karnataka, FactCheck

బెంగళూరు రహదారిపై కరెంట్ వైర్ కారణంగా మంటలు చెలరేగాయంటూ పోస్టులు వైరల్ 

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా వీధులు చిన్న చిన్న నదులుగా మారాయి, వాహనాలు నీట మునిగినట్లు, ఇళ్లలోకి నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో జనం చిక్కుకుపోయారు. వారిని కాపాడడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో రోడ్డుపై వెళుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వరదలతో నిండిన రహదారిపై పడిపోయిన విద్యుత్ వైరు కారణంగా మంటలను చెలరేగుతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. (ఆర్కైవ్)

26-సెకన్ల వీడియో వరదలు ఉన్న రహదారిపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ వైర్‌లను చూపుతోంది. వీధిలో నిప్పురవ్వలు పడుతూ ఉండగా.. షార్ట్ సర్క్యూట్‌కు దారితీసింది.

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ వీడియో వియత్నాంకు సంబంధించింది, బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన కాదు.

వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్ లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అది 'వియత్నాం' అనే క్యాప్షన్‌తో అక్టోబర్ 16, 2024న X ఖాతాలో పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. ఇది భారతదేశం వెలుపల జరిగిన ఘటన అని సూచించింది.

సంబంధిత కీవర్డ్ సెర్చ్ ద్వారా మాకు వియత్నామీస్ వార్తా సంస్థల బహుళ నివేదికలను కనుగొన్నాం. వియత్నామ్‌ప్లస్ అనే స్థానిక మీడియా, అక్టోబర్ 16, 2024న, ‘కెన్ థోలో వరదలున్న వీధిలో తెగిపడిన విద్యుత్ లైన్ దృశ్యం’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. నివేదికలో వైరల్ అవుతున్న ఉన్న వీడియో ఉంది.

వైరల్ వీడియోలో ఈ ఘటనకు దారితీసిన వివరాలను నివేదిక వివరించింది. వియత్నాంలోని కాన్ థో అనే నగరంలో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించింది. భారీ తుఫాను సమయంలో, అధిక ఓల్టేజీ ఉన్న విద్యుత్ లైన్ తెగిపోయి వరద నీటితో ఉన్న వీధిలో పడిపోయిందని నివేదిక వివరించింది. విద్యుత్ లైన్ నుండి నిప్పురవ్వలు రావడం కూడా చూడొచ్చు. ఇది ప్రమాదకరమైన దృశ్యాన్ని సృష్టించింది.

మరో వియత్నామీస్ వార్తా సైట్, అఫామిలీ కూడా అక్టోబర్ 16, 2024న జరిగిన సంఘటనను కవర్ చేసింది.

‘Horrifying clip of broken electric wire falling onto flooded road, sparks flying everywhere’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని నివేదించారు.

ఈ వీడియోలో, వరదలున్న రహదారిపై విద్యుత్ స్పార్క్‌ కనిపించడంతో ప్రజలు ఇతరులను హెచ్చరించడం మనం వినవచ్చు. విద్యుత్ తీగలు మెరుస్తున్న వరద ప్రాంతాన్ని తప్పించుకుంటూ వీధిలోని పొడి ప్రాంతం గుండా వాహనాలను నడిపారు.

అక్టోబరు 15, 2024న Tuoi Tre News అందించిన నివేదిక ప్రకారం భారీ వర్షాల కారణంగా నగరంలో వరదలు సంభవించాయని నిర్ధారించింది.

వైరల్ వీడియోలో విద్యుత్ లైన్ షార్ట్ సర్క్యూట్ వంటి సంఘటనలతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని వివరించారు. వీధులన్నీ వరదనీటిలో మునిగిపోయాయనే నివేదిక కూడా మేము గమనించాం.

బెంగళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డుపై ఎలక్ట్రికల్ వైర్‌ నుండి నివ్వు రవ్వలు వచ్చాయని చూపించే వీడియోలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము. ఈ ఫుటేజ్ వియత్నాంకు సంబంధించింది.

Credit: Sibahathulla Sakib

Next Story