నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్‌లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్‌లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
సైన్యంతో సహా భారత అధికారులు ఇంటర్వ్యూలు, సమావేశాలలో కొన్ని నష్టాలు సంభవించాయని అంగీకరించారు. అయితే, వారు ఇందులో పాల్గొన్న ఫైటర్ జెట్‌ల సంఖ్యను లేదా నిర్దిష్ట రకాల వివరాలను బయట పెట్టలేదు.
ఈ సందర్భంలో భారతదేశం మూడు రఫేల్ జెట్‌లను కోల్పోయిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అంగీకరించినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో "ఆ రాత్రి పాకిస్తాన్ మాపై భారీగా దాడి చేసింది, మేము ఇప్పటికే రెండు రోజుల క్రితం పాకిస్తాన్ చేతిలో మూడు రఫేల్‌లను కోల్పోయాము. కాబట్టి, వారు దాడి చేయడం చాలా అన్యాయం, కానీ వారు ఎలాగైనా చేసారు. ఆ తర్వాత మేము చాలా త్వరగా స్పందించాము. మరుసటి రోజు ఉదయం, మిస్టర్ రూబియో నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ మాట్లాడటానికి సిద్ధంగా ఉందని చెప్పారు" అని పేర్కొంటూ ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేశారు.
"భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్‌తో జరిగిన పోరాటంలో భారతదేశం మూడు రఫేల్ జెట్‌లను కోల్పోయిందని అంగీకరించారు" అని పోస్టుల్లో పేర్కొన్నారు. (ఆర్కైవ్)
ఇదే వాదనతో పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు చేశారు.
నిజ నిర్ధారణ:
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం మూడు రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించాడనే వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ క్లిప్‌ను ఎడిట్ చేశారు.
వైరల్ క్లిప్ ఆడియోను చాలాసార్లు విన్న తర్వాత, ‘మేము రెండు రోజుల క్రితం పాకిస్తాన్ చేతిలో ఇప్పటికే మూడు రాఫెల్‌లను కోల్పోయాము. కాబట్టి, వారు దాడి చేయడం చాలా అన్యాయం, కానీ వారు దాడి చేసారు’ అని చెప్పే స్వరం మంత్రి అసలు స్వరంతో సరిపోలడం లేదని మేము గమనించాము. క్లిప్‌లో రెండు వేర్వేరు స్వరాలను మేము స్పష్టంగా గుర్తించగలిగాము. అలాగే జైశంకర్ లిప్-సింక్ విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. ఇది ఎడిట్ చేసిన వీడియో అని తెలుస్తోంది.
తర్వాత, మేము క్లిప్ కు సంబంధించిన కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. జూలై 1న అమెరికన్ మీడియా సంస్థ న్యూస్‌వీక్ ప్రచురించిన ఇంటర్వ్యూకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్‌ను కనుగొన్నాము.
ఛానెల్ ప్రకారం, జైశంకర్ న్యూస్‌వీక్ CEO దేవ్ ప్రగాడ్‌తో వివరణాత్మక సంభాషణ జరిపారు. ఈ సంభాషణలో, జైశంకర్ భారతదేశం విదేశీ సంబంధాలు, దాని లక్ష్యాలు, సవాళ్లు, వ్యూహాత్మక అంశాలను చర్చించారు. 43:05 నిమిషాల వద్ద, వైరల్ క్లిప్ వీడియోలో కనిపిస్తుంది, జైశంకర్ మాట్లాడుతూ "ఆ రాత్రి పాకిస్తాన్ మాపై భారీగా దాడి చేసింది. ఆ తర్వాత మేము చాలా త్వరగా స్పందించాము. మరుసటి రోజు ఉదయం రూబియో నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇది భారతదేశం మూడు రాఫెల్ జెట్లను కోల్పోయిందని చేసిన ప్రకటన వైరల్ క్లిప్‌కు జోడించినట్లుగా ధృవీకరించారు.
జూలై 1న మంత్రి X హ్యాండిల్‌లో జైశంకర్, దేవ్ ప్రగాద్ మధ్య జరిగిన సంభాషణ ప్రత్యక్ష ప్రసారం అయినట్లు కూడా మేము కనుగొన్నాము. పాకిస్తాన్ దాడి గురించిన చర్చ, భారతదేశం వేగవంతమైన ప్రతిస్పందన, పాకిస్తాన్ మాట్లాడటానికి సిద్ధంగా ఉందని రూబియో చేసిన కాల్ గురించి అదే క్రమంలో కనిపించాయి. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో డాగ్‌ఫైట్ సమయంలో భారతదేశం మూడు రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించిన సందర్భం మాకు కనిపించలేదు.
కాబట్టి, వైరల్ క్లిప్ లో ఆడియోను జోడించడం ద్వారా డిజిటల్‌గా ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.
Credit: Mahfooz Alam