నిజమెంత: కాంగ్రెస్ పార్టీ కులమతాలతో ఓట్లను విభజించి కుట్రకు పాల్పడ్డాలని మంత్రి ఎంబీ పాటిల్ లెటర్ ను విడుదల చేశారా?

2017 జూలై 10న సోనియాగాంధీకి కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఓ లేఖ రాసినట్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2024 2:00 PM IST
fact check, fake letter,  karnataka, congress,

నిజమెంత: కాంగ్రెస్ పార్టీ కులమతాలతో ఓట్లను విభజించి కుట్రకు పాల్పడ్డాలని మంత్రి ఎంబీ పాటిల్ లెటర్ ను విడుదల చేశారా?

2017 జూలై 10న సోనియాగాంధీకి కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఓ లేఖ రాసినట్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అనుసరించిన ‘హిందువులను విభజించండి–ముస్లింలను ఏకం చేయండి’ అనే వ్యూహాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయాలని అందులో చెప్పినట్లుగా ఉంది.

డాక్టర్ MB పాటిల్ అధ్యక్షుడిగా ఉన్న బీజాపూర్ లింగాయత్ జిల్లా విద్యా సంఘం (BLDEA) లెటర్ హెడ్‌పై ఆయన కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారని కనిపిస్తోంది.

కర్ణాటక అసెంబ్లీకి 2018 ఎన్నికల కోసం అమలు చేయాల్సిన వ్యూహంపై పటేల్, పలువురు మంత్రులతో పాటు గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ (జీసీసీ), వరల్డ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐఓ) ప్రతినిధులతో సమగ్రంగా చర్చించినట్లు లేఖలో తెలిపారు. "ముస్లింలు, క్రైస్తవులను వారి మతం ఆధారంగా ఏకం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. హిందువులను కులం/ఉప-కులం, వర్గం ఉప/వర్గాల ఆధారంగా విభజించండి" అని లేఖలో పేర్కొన్నారు.

ఒక X వినియోగదారు మే 29, 2024న ఈ లేఖను పంచుకున్నారు. “కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన గురించి జాగ్రత్తగా చూడండి. బీజేపీని ఓడించాలంటే హిందువులను విభజించాలని, గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్ & వరల్డ్ ఇస్లామిక్ ఆర్గ్ నుంచి సహాయం తీసుకున్నామని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టంగా రాశారు.” అని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.

మరో X వినియోగదారు ఈ లేఖను మే 23, 2024న షేర్ చేశారు. “కాంగ్రెస్ ఏ మేరకు దిగజారిపోతోందో జాగ్రత్తగా చూడండి. బీజేపీని ఓడించాలంటే హిందువులను విభజించండని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఎంబీ పాటిల్ సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పారు. ఈ ప్రణాళికలను అమలు చేయడానికి, గ్లోబల్ క్రిస్టియన్ కౌన్సిల్, వరల్డ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుండి సహాయం తీసుకున్నారు." అనే వాదనతో హిందీలో పోస్టులను వైరల్ చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న లేఖ నకిలీ అని న్యూస్ మీటర్ గుర్తించింది.

లెటర్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఈ లేఖను 2018 మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు న్యూస్ పోర్టల్ పోస్ట్‌కార్డ్ ప్రచురించింది.

అయితే, ఈ లేఖ వైరల్ కావడంతో, ఎంబి పాటిల్ లేఖ నకిలీదని పేర్కొంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసలు లెటర్ ను, వైరల్ లెటర్‌లోని తేడాలను తెలియజేస్తూ X, ఫేస్‌బుక్ ఖాతాలలో వివరణ ఇస్తూ పోస్ట్ చేశారు. అదనంగా, తప్పుడు వాదనను పోస్టు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. దానితో పాటు.. ఈ లేఖ నకిలీది.. దానిని తయారు చేసి ప్రచురించిన వారిపై ఫోర్జరీ చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బీజేపీ ప్రజల మద్దతును కోల్పోయినందున వారు పూర్తిగా నకిలీ లేఖలపై ఆధారపడుతున్నారని ఆరోపించారు.

పాటిల్ లేఖ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని.. తన మీద జరుగుతున్న కుట్రలపై హెచ్చరించడానికి విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు.

కర్నాటక కాంగ్రెస్ ఏప్రిల్ 16, 2019న విలేకరుల సమావేశం వీడియోను ట్వీట్ చేసింది. “లేఖ నకిలీది. దానిని తయారు చేసి ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు తెలిపింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని తెలిపింది. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న వారందరినీ కటకటాల పాలు చేస్తాము" అని హెచ్చరించింది.

ఆశ్చర్యకరంగా, 2019లో 'కాంగ్రెస్‌ కుట్రలను బహిర్గతం చేయబోతున్నాం' అంటూ లేఖను షేర్ చేసిన బీజేపీ కర్ణాటక X ఖాతాలో ఇప్పటికీ ఆ పోస్టు ఉంది.

‘పోస్ట్‌కార్డ్ న్యూస్ కో-ఫౌండర్ మళ్లీ అరెస్ట్, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నట్లు అభియోగాలు మోపారు’ అనే NDTV నివేదికను మేము గుర్తించాం. పోస్ట్‌కార్డ్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహేష్ విక్రమ్ హెగ్డే 2019లో అరెస్టయ్యారు.

ప్రతి సంవత్సరం వైరల్ అవుతున్న లెటర్:

ఈ లేఖను కల్పితమని గుర్తించి, తప్పుడు ప్రచారం చేసిన వారికి జరిమానా విధించినప్పటికీ, ప్రతి సంవత్సరం ఈ లెటర్ సోషల్ మీడియాలో మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది. 2018లో Facebookలో, 2021, 2022 సంవత్సరాలలో Xలో వివిధ వినియోగదారుల ఈ లేఖను పంచుకున్నాయి.

అందుకే, కర్ణాటక ఎన్నికల్లో గెలవడానికి ‘హిందువులను విభజించండి–ముస్లింలను కలపండి’ అనే వ్యూహాన్ని వివరిస్తూ ఎంబి పాటిల్ సోనియా గాంధీకి లేఖ రాశారనే వాదన అబద్ధం.

Next Story