FactCheck : సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్ నిజంగానే కేటీఆర్ చేసారా?

Fact-check about KTR’s Comments On Munugode ByPoll. గతంలో ఏ ఉపఎన్నికలకు కనిపించని వాడివేడి ప్రచారం మునుగోడు ఉప ఎన్నికలో కనిపించింది.

By Nellutla Kavitha  Published on  5 Nov 2022 10:00 PM IST
FactCheck : సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్ నిజంగానే కేటీఆర్ చేసారా?
గతంలో ఏ ఉపఎన్నికలకు కనిపించని వాడివేడి ప్రచారం మునుగోడు ఉప ఎన్నికలో కనిపించింది. రెండు నెలల పాటు ఆరోపణలు - ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలతో మునుగోడు అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో పాటే నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను ప్రచారం కోసం విపరీతంగా వినియోగించారు. మునుగోడు ఉపఎన్నిక ముగిసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది ఒక పోస్ట్.


టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు అంటు సర్క్యులేట్ కావడంతో చర్చ మొదలైంది. మునుగోడు ఆత్మ గౌరవం లేదు మన్ను లేదు అంటూ మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినట్టుగా ఆ పోస్ట్ సారాంశం.

నిజనిర్ధారణ :

వైరల్ అయిన ఈ పోస్టులో నిజమెంతో తెలుసుకునేందుకు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన కేటీఆర్ అదే ఫోటోతో ఉన్న ఒక ఇంటర్వ్యూ ని టిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ నవంబర్ 1న ట్వీట్ చేసింది.

https://twitter.com/trspartyonline/status/1587269236325462016?s=46&t=_QNb50WkvUu1EsHQbsV-Ig

టీ న్యూస్ కి కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లింకును కూడా పోస్ట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్.

https://bit.ly/3Do5PzV

ఇక ఈ పోస్ట్ పై మరోసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫాక్ట్ చెక్ టీం. దీంతో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి ట్విట్టర్ పోస్ట్ కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ పోస్ట్, ఫేక్ న్యూస్ అని దీనిపై తాము పోలీసులకు కంప్లైంట్ చేశామని, ఇలాంటి ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేస్తూ యూత్ తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటూ సతీష్ రెడ్డి ట్వీట్ చేశారు.

https://twitter.com/ysathishreddy/status/1588910201243328512?s=20&t=Ct0iL74x-16wTwk80sMatA

సో సోషల్ మీడియాలో కేటీఆర్ కామెంట్స్ పేరుతో వైరల్ అయిన పోస్ట్ నిజం కాదు.


Claim Review:సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్ నిజంగానే కేటీఆర్ చేసారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story