యూరప్ దేశాల్లో ఉద్యోగాలు అందుకోవచ్చు అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. కెనెడాకు చెందిన కంపెనీ `Acciona Energy' లో ఉద్యోగాలను సంబంధించి ఓపెనింగ్స్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. అన్ని సదుపాయాలను కంపెనీనే కల్పిస్తుందంటూ ఆ మెసేజీలో చెప్పుకొచ్చారు. అక్కడికి టికెట్స్, వీసా కూడా అందిస్తామని చెబుతూ లింక్ ను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఆసక్తి ఉన్న వాళ్లు వైరల్ పోస్టులో కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయాలంటూ చెబుతూ వస్తున్నారు.
https://m.facebook.com/groups/1025932177749284/permalink/1522644564744707/?sfnsn=wiwspwa
ఉద్యోగులకు లభించే అనేక ప్రయోజనాలు మరియు ప్రోత్సాహకాల గురించి పోస్టులోనే తెలియజేశారు. ఉచిత రవాణా, నెలకు 7000 డాలర్ల జీతం మరియు వైద్య సహాయం ఉన్నాయి. ఇది మరిన్ని వివరాల కోసం వాట్సాప్ లింక్‌ను ఇచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి 'నిజం లేదు'.
మొదట వైరల్ పోస్ట్ చాలా అస్పష్టంగా ఉంది. ఇది మోసపూరితమైనది అర్థమవుతుంది. అక్కడ సదరు సంస్థకు సంబంధించిన ప్రొఫైల్ లేదా పోర్ట్‌ఫోలియో గురించి ప్రస్తావించలేదు. ఇది అభ్యర్థుల కోసం కంపెనీ వెతుకుతున్న అవసరాలపై వివరాలు లేకుండా కొన్ని ఉద్యోగాల గురించి మాత్రమే పేర్కొంది. వెబ్‌సైట్ లో అనేక ఉద్యోగాల లభ్యత గురించి ప్రస్తావించింది కాని.. ఫేస్‌బుక్ పోస్ట్ యొక్క ప్రోత్సాహకాలను చెప్పలేదు. వెబ్ సైట్ లో మాత్రం సంస్థ అభ్యర్థుల వివరాల కోసం ఉంచారు.
https://www.acciona.com/our-purpose/work-with-us/job-offers/
ఇక ఇంతకు ముందే ఇలాంటి వెబ్ సైట్ల ద్వారా మోసపోకండి అంటూ ఫ్యాక్ట్ చెక్ చేయడం కూడా జరిగింది. వెబ్సైట్ లో ఉన్న ఈమెయిల్ ను సంప్రదించగా.. తాము సోషల్ మీడియా ద్వారా ఉద్యోగులు కావాలని అడగలేదని.. శాలరీ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ఇలాంటి లింక్ లను అసలు నమ్మకండని తెలిపారు.
https://www.vishvasnews.com/viral/fact-check-this-viral-job-opening-in-canada-with-hard-to-believe-perks-is-fake/
ఈ వైరల్ లింక్ ను ఫేస్ బుక్ సంస్థ కూడా ఫేక్ అంటూ మార్క్ చేసింది. పలు మీడియా సంస్థలు కూడా ఇది ఫేక్ అని చెప్పాయి. ఇలాంటి లింక్ లను క్లిక్ చేయడం ద్వారా ఇతరులు మీ డబ్బును తీసుకోవడం.. మీ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.