FactCheck : ట్విట్టర్ మాజీ సీఈవోను అరెస్టు చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు

Ex-Twitter CEO Parag Agrawal was not arrested for possession of child porn. ట్విటర్‌ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ అరెస్ట్‌పై ఓ కథనం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2022 2:30 PM GMT
FactCheck : ట్విట్టర్ మాజీ సీఈవోను అరెస్టు చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు

ట్విటర్‌ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ అరెస్ట్‌పై ఓ కథనం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. "మాజీ ట్విటర్ సీఈఓ పరాగ్ చైల్డ్ పోర్న్ ఘటనలో అరెస్టు చేయబడ్డాడు" అని హెడ్‌లైన్ చదువుతుంది. వాంకోవర్ టైమ్స్ నివేదికలో ఈ కథనం వచ్చినట్లుగా పోస్టులు పెడుతూ వచ్చారు.


ఒక ట్విటర్ వినియోగదారు ఈ కథనానికి సంబంధించిన లింక్‌ను షేర్ చేస్తూ, "ఎలోన్ మస్క్ నుండి వచ్చిన సూచన మేరకు ట్విటర్ మాజీ CEO పరాగ్ అగర్వాల్ చైల్డ్ పోర్నోగ్రఫీని కలిగి ఉన్నందుకు అరెస్టు చేశారు" అని రాశారు.("Parag Agrawal, the former CEO of Twitter, has been arrested for possession of child pornography after a tip-off from Elon Musk.")

అనేక మంది ఇతర వినియోగదారులు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను, కథనానికి సంబంధించిన లింక్‌ను షేర్ చేసారు.


నిజ నిర్ధారణ :

మాజీ ట్విటర్ సీఈఓపై చేసిన ట్వీట్లపై పలువురు ట్విట్టర్ వినియోగదారులు వ్యాఖ్యానించడాన్ని న్యూస్ మీటర్ గమనించింది. మేము వాంకోవర్ టైమ్స్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసాము.. అది సెటైరికల్ వెబ్‌సైట్ అని కనుగొన్నాము. వ్యంగ్యంగా వార్తలు రాసే వెబ్ సైట్ అని గుర్తించాం.


వెబ్‌సైట్ యొక్క "అబౌట్ అస్" విభాగంలో కూడా ఈ విషయాన్నే ప్రస్తావించారు. "వాంకోవర్ టైమ్స్ వెస్ట్ కోస్ట్‌లో వ్యంగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు. మేము సంప్రదాయవాదులను ప్రభావితం చేసే సమస్యల గురించి వ్యంగ్య కథనాలను వ్రాస్తాము." ("Vancouver Times is the most trusted source for satire on the West Coast. We write satirical stories about issues that affect conservatives.") అని ఉంది.

మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. పరాగ్ అగర్వాల్ అరెస్టును నివేదించిన విశ్వసనీయ మీడియా సంస్థలకు సంబంధించి ఎటువంటి నివేదికను చూడలేదు.

ట్విటర్‌ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ అరెస్ట్‌పై వచ్చిన వాదన అవాస్తవమని మేము నిర్ధారించాము.


Claim Review:ట్విట్టర్ మాజీ సీఈవోను అరెస్టు చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story