బీహార్‌లో ఏడు దశల్లో జరిగే 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను చూపుతున్న అధికారిక నోటిఫికేషన్ వైరల్‌గా మారింది. నోటీసు ప్రకారం పోలింగ్ తేదీలను ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19గా పేర్కొంది. "బీహార్ లోక్‌సభ ఎన్నికల తేదీలు"గా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఈ పోస్టులను పంచుకున్నారు.
అదేవిధంగా, మహారాష్ట్రలో ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయంటూ ఒక X వినియోగదారు ట్వీట్ చేశారు.
NDA నేతృత్వంలోని (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) 17వ లోక్‌సభ సమావేశాల అధికారిక పదవీకాలం జూన్ 16, 2024న ముగియనున్నందున, భారతదేశంలోని 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. సార్వత్రిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.
మేము 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. కానీ భారత ఎన్నికల సంఘం నుండి ఎటువంటి నోటిఫికేషన్ లేదా ప్రకటనకు సంబంధించిన వార్తలు ప్రధాన స్రవంతి మీడియాలో కనుగొనలేకపోయాం.
అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇచ్చిన నివేదికను మేము చూశాము. నివేదికలోని తేదీలు ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు దశల్లో బీహార్, ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 29 వరకు మహారాష్ట్రలో అంటూ వైరల్ పోస్ట్‌లలో పేర్కొన్న తేదీలతో సరిపోలాయి.
మేము బీహార్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో 2019 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా కనుగొన్నాము. EC నోటిఫికేషన్‌లోని 15వ పేజీలోని షెడ్యూల్ ను.. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
మహారాష్ట్రలో 2024 ఎన్నికల షెడ్యూల్.. 2019 ఎన్నికల మాదిరిగానే ఉందని మేము కనుగొన్నాము. అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 11, 18, 23, 29 నాలుగు దశల్లో తేదీలను పేర్కొన్నది. అధికారిక EC నోటిఫికేషన్‌లోని 50, 84 పేజీలలో ఇదే ఉందని మేము గమనించాం.
అందువల్ల, 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను.. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌గా తప్పుగా షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము. భారత ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించాల్సి ఉంది.
Credits : Md Mahfooz Alam