సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్టులో ఒక చేత్తో గ్లాస్ బాక్స్ లో ఉన్న బంగారు బిస్కెట్ ను సొంతం చేసుకోవచ్చనే పోటీ నిర్వహిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.
వైరల్ పోస్ట్‌లో, దుబాయ్ విమానాశ్రయంలో ఈ ఛాలెంజ్ జరిగిందని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌లోనూ కనిపించింది. NDTV, అమర్ ఉజాలా, టైమ్స్ ట్రావెల్ వంటి కొన్ని భారతీయ మీడియా పోర్టల్స్ కూడా దీనిని నివేదించాయి.
20 కిలోల గోల్డ్ బార్ ఛాలెంజ్ కొత్త ట్రెండ్ కాదు. మీరు ఇంటర్నెట్‌లో చాలానే చూసి ఉంటారు. ఇది దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందా లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.
నిజ నిర్ధారణ :
NewsMeter విశ్వసనీయ మూలాల నుండి నివేదికలను కనుగొనడానికి కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసింది. విమానాశ్రయంలో అలాంటి సంఘటన లేదా ఛాలెంజ్ జరగలేదని స్పష్టం చేస్తూ గల్ఫ్ న్యూస్‌లోని మీడియా కథనాన్ని మేము కనుగొన్నాము.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి కూడా ఈ విషయం తెలిపారు. "ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం లేదా గతంలో కూడా మా ఎయిర్‌పోర్ట్‌లలో (దుబాయ్ ఇంటర్నేషనల్ మరియు దుబాయ్ వరల్డ్ సెంట్రల్)లో లేదని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో నిర్ధారించగలవు." అని అన్నారు. వైరల్ అవుతున్న వీడియో దుబాయ్ ఎయిర్ పోర్టులో జరగలేదని తెలిపారు.
మేము మరొక అంతర్జాతీయ మీడియా నివేదిక కోసం ఇంటర్నెట్ లో వెతికాం. ది అరేబియన్ స్టోరీస్ మరొక నివేదికను కూడా మేము కనుగొన్నాము, ఇది పుకార్లను కూడా ఖండించింది.
అందువల్ల దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఛాలెంజ్ ఎప్పుడూ నిర్వహించబడలేదని స్పష్టమైంది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.