కాఫీలో నిమ్మరసం కలిపితే బరువు తగ్గుతుందని సోషల్ మీడియా యూజర్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు.
NewsMeter సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను కూడా కనుగొంది. వాటిలో "కాఫీలో నిమ్మకాయ రసం కలిపితే 3 రోజుల్లో పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తొలగించవచ్చు. డైటింగ్ అవసరం లేదు. కఠినమైన వ్యాయామం అక్కరలేదు" అని ఉంది.
చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. ఎన్నో శారీరక పరమైన సమస్యలతో పోరాడుతున్నారు. ఈ వీడియో ద్వారా అనారోగ్యకరమైన బరువు తగ్గించే పద్ధతులను అనుసరించాలని ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ట్రెండ్‌లను అనుసరించమని చెబుతున్నారు. ట్రెండ్‌ని అనుసరించాలని.. ప్రతి ఒక్కర నిమ్మకాయ రసం.. కాఫీ కలిపి తాగితే బరువు తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇదొక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని చెబుతున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ వైరల్ క్లెయిమ్‌ను నిరూపించగల శాస్త్రీయ ఆధారాల కోసం శోధించింది. ఈ దావా తప్పు అని గుర్తించింది.
ఒక అధ్యయనం ప్రకారం. బరువు తగ్గడానికి నిమ్మకాయలో కొన్ని పోషక గుణాలు ఉన్నాయి. అనేక సిట్రస్ పండ్ల మాదిరిగానే, నిమ్మకాయలు విటమిన్ సి ఘన మూలంగా ఉంటాయి. నిమ్మకాయలలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. కానీ బరువు తగ్గడానికి ఇదేమీ మ్యాజిక్ ద్రావణం కాదు.
నిమ్మకాయ రసంతో ఉన్న కాఫీ తాగడంపై మరొక అధ్యయనం ఇలా చెబుతుంది "నిమ్మకాయను ఉపయోగించే వివిధ అంశాలకు సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. నిమ్మకాయ కానీ.. కాఫీ కానీ కొవ్వును కరిగించలేవు. అవాంఛిత కొవ్వును వదిలించుకోవడానికి ఏకైక మార్గం తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడమే. ఆ కేలరీలను ఎప్పటికప్పుడు బర్న్ చేస్తూ ఉండాలి. కాబట్టి, ఈ వాదన తప్పు."
న్యూస్‌మీటర్ కేర్ హాస్పిటల్స్‌కు చెందిన పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్‌ను సంప్రదించింది, "ఒక్క ఆహార పదార్థం లేదా పానీయంతో బరువు తగ్గడం జరగదు. కాఫీ, నిమ్మకాయ బరువు తగ్గడంలో మీకు సహాయపడవు. జీవనశైలిలో మార్పులు, క్యాలరీ-నియంత్రిత ఆహారంతో కలిసి ఉండాలి. సరైన ప్రోటీన్, కరెక్ట్ సమయాలతో తీసుకునే ఆహారం జీవక్రియలో మార్పులు తీసుకుని రావడమే కాకుండా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది." అని సుజాతా అన్నారు.
కాఫీ నిమ్మకాయ రసం కలిసి తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయపడతాయని రుజువు చేసే ఆధారాలు లేవు. ఈ మిశ్రమం మూడు రోజులు లేదా ఒక వారంలో పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించగలదని ఎటువంటి ఆధారాలు లేవు.
కాఫీ, నిమ్మకాయలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఈ రెండింటిని కలిపి తీసుకుంటే బరువు తగ్గిపోతామని అనుకోవడం చాలా తప్పు.
కాబట్టి, వైరల్ క్లెయిమ్ నిజమైనది కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.