దీపావళి పండుగను దేశంలోని పలు ప్రాంతాల్లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే అమెరికాలో కూడా దీపావళిని ఘనంగా జరుపుకున్నారంటూ పోస్టులు వైరల్ చేశారు. ఓ వీడియోలో పెద్ద ఎత్తున టపాసులు రోడ్డుపై ఉంచి కాలుస్తున్నట్లు ఉంది. ఇది అమెరికాలో ఇటీవల దీపావళి పండుగ సమయంలో చోటు చేసుకుందని పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.
"Diwali Celebrations in America" అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో ఇదని సోషల్ మీడియాలో చెబుతున్నారు. వేలాది మంది వీక్షకులు ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. యూఎస్‌లో దీపావళి వేడుకల వీడియో అంటూ చేస్తున్న వాదన తప్పు.
న్యూస్‌మీటర్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో ఏప్రిల్ 2021లో Facebookలో పోస్ట్ చేయబడింది. ఇది తైవాన్‌లోని బైషాతున్ మట్సు పవిత్ర స్థలానికి సంబంధించినది. అమెరికాకు సంబంధించినది కాదు.
దీని ఆధారంగా ఏప్రిల్ 2021లో బైషాతున్ మట్సు వేడుకల వీడియోల కోసం శోధించాము. ఏప్రిల్ 2021లో తైవాన్‌లో జరిగిన ఉత్సవాలను చూపించే సుదీర్ఘ వీడియో తైవాన్ ఆధారిత వార్తా ఛానెల్ YouTube పేజీ SETN.com ద్వారా పోస్ట్ చేయబడింది. "బైషాతున్ మజుకు సాదరంగా స్వాగతం పలికేందుకు 500 మీటర్ల మేర బాణసంచా కాల్చారు" అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్ చేశారు. "Firecrackers stretch for 500 meters to warmly welcome Baishatun Mazu" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
12 ఏప్రిల్ 2021 తైపీ టైమ్స్ నివేదిక ప్రకారం, తైవాన్‌లోని అతిపెద్ద వార్షిక మతపరమైన ఊరేగింపులలో ఒకటైన బైషాతున్ మట్సు తీర్థయాత్ర మియాలీ కౌంటీలోని బైషాతున్ నుండి బయలుదేరింది. సముద్ర దేవత మట్సు ఊరేగింపును గాంగ్ టియాన్ ఆలయం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఊరేగింపులో పాల్గొనడానికి సుమారు 78,000 మంది వచ్చారని అధికారులు తెలిపారు. యున్లిన్ కౌంటీలోని బీగాంగ్‌లోని చావో తియాన్ ఆలయానికి 400 కిలోమీటర్లు ఊరేగింపు పూర్తయిన తర్వాత తిరిగి వస్తుంని అది జోడించింది.
ఇదే వీడియో జూలై 2021లో ఇటలీ యూరో కప్ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నట్లు చూపిస్తూ వైరల్ అయింది.
అనేక మంది NRIలు అలాగే స్థానిక అమెరికన్లు అమెరికా మరియు ఇతర దేశాలలో దీపావళిని జరుపుకున్నప్పటికీ.. ఇది అమెరికాలో దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో అంటూ చేస్తున్న వాదన తప్పు.