"గుడ్ మార్నింగ్" వాట్సాప్ ఫార్వార్డ్‌లను పంపడం వల్ల వినియోగదారుల డేటా లీక్ అవుతుందనే సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ సందేశం ఇలా ఉంది, "ఈరోజు, షాంఘై చైనా ఇంటర్నేషనల్ న్యూస్ చందాదారులందరికీ SOS పంపబడింది (ఇది మూడవ రిమైండర్), నిపుణులు సలహా ఇస్తున్నారు: గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన చిత్రాలను, వీడియోలను పంపవద్దు. హ్యాకర్లు వాటిపై దృష్టి పెట్టారు. హ్యాకర్‌లు మీ ఫోన్ ని ఉపయోగించి బ్యాంక్ కార్డ్ సమాచారం, డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేస్తారు" అని ఉంది.
వినియోగదారులను వారి ఫోన్‌ల అలాంటి మెసేజీలను తొలగించమని కోరుతున్నారు. "ఎవరైనా మీకు అలాంటి చిత్రాలను పంపినట్లయితే, వాటిని వెంటనే మీ పరికరం నుండి తీసివేయండి. హానికరమైన కోడ్ అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకుంటే, ఎటువంటి హాని జరగదు," ఇది మరింత సమాచారం మెసేజ్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter సెర్చ్ ను నిర్వహించింది. 'షాంఘై చైనా ఇంటర్నేషనల్ న్యూస్' పేరుతో వెబ్‌సైట్ లేదా సంస్థ ఏదీ కనుగొనబడలేదు.
ఏ వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ యాప్‌లు ప్రభావితమయ్యాయి లేదా సాంకేతిక కోణం నుండి దాడి ఎలా పని చేస్తుంది వంటి సంబంధిత వివరాలను కూడా హెచ్చరికలో చేర్చలేదు.
మేము అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్‌లను కూడా తనిఖీ చేసాము కానీ అలాంటి ప్రకటన ఏదీ కనుగొనబడలేదు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెబ్‌సైట్‌లో కూడా మేము దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కనుగొనలేదు.
CERT-In, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద, సైబర్ బెదిరింపుల నుండి భారతీయులను రక్షించే బాధ్యతను కలిగి ఉంది.
2017 నుండి ఇలాంటి పోస్ట్ సర్క్యులేషన్‌లో ఉందని కూడా మేము కనుగొన్నాము.
తదుపరి పరిశోధనల.. డేటా సోర్స్‌లో రహస్య సమాచారాన్ని దాచే ప్రక్రియను స్టెగానోగ్రఫీ అని పిలుస్తారని మేము కనుగొన్నాము. ఇందులో, మాల్వేర్ లేదా ఫిషింగ్ URLలను టెక్స్ట్ ఫైల్, ఇమేజ్‌లు, ఆడియో, వీడియోలో దాచవచ్చు.
మలేషియాకు చెందిన న్యూస్ పోర్టల్ 'ది స్టార్' రెండేళ్ల క్రితం ఇదే బూటకపు సందేశం గురించి నివేదించింది. దానిని నకిలీ అని పేర్కొంది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.