బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు చెబుతున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మొదటి వీడియోలో “పాలస్తీనియన్లతో జరుగుతున్నది చాలా తప్పు. ఈ ఘటనలు నన్ను భాదిస్తూ ఉన్నాయి. అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను." అని చెబుతున్నట్లు ఉంది.
రెండవ వీడియోలో అక్షయ్ కుమార్ తన ముఖంపై పాలస్తీనా అనుకూల సంకేతాలతో కనిపిస్తాడు. "నేను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాను. వారికి ఎలాంటి చెడు జరగదు" అని చెప్పడం వినవచ్చు. పాక్ పాలస్తీనాకు అండగా ఉంటే భారత్ కూడా అండగా ఉంటుంది. ఐ లవ్ యు పాలస్తీనా అని అన్నట్లుగా మనం గుర్తించవచ్చు.
నిజ నిర్ధారణ :
రెండు వీడియోలు ఎడిట్ చేసినవేనని న్యూస్‌మీటర్ కనుగొంది. రెండు వీడియోలలో అక్షయ్ కుమార్ ఆడియోను డిజిటల్‌గా జోడించారు.
మేము అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌ని తనిఖీ చేసాము. 3 అక్టోబర్ 2020న పోస్ట్ చేసిన మొదటి వీడియోకు సంబంధించిన ఎడిటెడ్ వీడియోను కనుగొన్నాము. ఇందులో కుమార్ పాలస్తీనాకు కాకుండా బాలీవుడ్ పరిశ్రమకు మద్దతుగా మాట్లాడాడు.
అందులో అక్షయ్ కుమార్ “ఈ రోజుల్లో చాలా ప్రతికూలత కారణంగా నేను ఈ రోజు బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నాను. పేదరికం మరియు నిరుద్యోగం నుండి అవినీతి వరకు ప్రజల సమస్యలను బాలీవుడ్ ఎల్లప్పుడూ చూపించడానికి ప్రయత్నిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం మిమ్మల్ని ఎంత బాధపెట్టిందో మమ్మల్ని కూడా అంతే బాధించింది. ఇది అనేక సమస్యలను లేవనెత్తింది.. మేమంతా ఆత్మపరిశీలన చేసుకోవలసి వచ్చింది." అని అన్నారు.
"బాలీవుడ్‌లో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ సమస్య ఉంది, కానీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉన్నారన్నది అర్థం కాదు" అని ఆయన చెప్పుకొచ్చారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ ఒకే కొలమానంతో అంచనా వేయవద్దని ప్రజలను అభ్యర్థించారు.
రెండవ వీడియోను కుమార్ 24 జూన్ 2022న Instagramలో పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోలో కూడా అతను పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడలేదు.
ఈ వీడియోలో, ‘జుగ్‌జుగ్ జీయో’ గురించి మాట్లాడాడు. అతను సినిమాను చూడమని ప్రజలను కోరాడు. నటీనటులు అనిల్ కపూర్, నీతూ సింగ్, వరుణ్ ధావన్ మరియు కియారా అద్వానీతో సహా నటీనటులు, చిత్రానికి పని చేసిన సిబ్బంది గురించి మాట్లాడాడు.
పాలస్తీనాకు మద్దతుగా అక్షయ్ కుమార్ మాట్లాడాడనే పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam